క్రీడాభూమి

ఇది ఆరంభమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 6: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత్ రెండోసారి టైటిల్ కైవసం చేసుకుని 13 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవడంతో జట్టు ప్రధాన కోచ్ హరేంద్ర సింగ్ ఇప్పుడు మరింత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. ఆసియా కప్‌ను సాధించడం కేవలం పునాది లాంటిదేనని, వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్‌తో పాటు ఆస్ట్రేలియాలో కామనె్వల్త్ క్రీడలు, ఇండోనేషియాలో ఆసియా క్రీడలు జరుగనుండటంతో భారత జట్టు మరింత కఠినమైన ప్రయాణాన్ని సాగించాల్సి ఉందని ఆయన స్పష్టం చేశాడు. ‘ఆసియా కప్ టైటిల్ సాధించడం మాకు కేవలం పునాది లాంటిదే. మున్ముందు మేము మరిన్ని విజయాలు సాధించాల్సి ఉంది. ప్రత్యేకించి 2018లో ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్‌తో పాటు కామనె్వల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు జరుగనుండటంతో మా ప్రయాణం మరింత కఠినంగా ఉంటుంది. ఈ మూడు టోర్నమెంట్లలో మేము కనీసం రెండింటిలోనైనా పతకాలను సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని హరేంద్ర సింగ్ తెలిపాడు.
చాంపియన్లకు హెచ్‌ఐ నజరానా
ఇదిలావుంటే, ఆదివారం జపాన్‌లోని కకమిగహరాలో జరిగిన ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్ ద్వారా 5-4 గోల్స్ తేడాతో చైనాను మట్టికరిపించి టైటిల్ కైవసం చేసుకున్న భారత మహిళా జట్టులోని సభ్యులందరికీ లక్ష రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) సోమవారం స్పష్టం చేసింది. అలాగే జట్టు కోచ్ హరేంద్ర సింగ్‌కు లక్ష రూపాయలు, సపోర్ట్ స్ట్ఫాకు రూ.50 వేల చొప్పున అందజేయనున్నట్లు ప్రకటించింది. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగించి టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు మొత్తం 28 గోల్స్ సాధించి, ప్రత్యర్థులకు కేవలం 5 గోల్స్ మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఈ ప్రదర్శన పట్ల హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ఆసియా కప్‌ను తీసుకొచ్చిన భారత జట్టుకు నిజంగా ఇది ఎంతో ప్రశంసనీయమైన విజయం. ఈ టోర్నమెంట్‌లో విజయం సాధించడంతో పాటు వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ హాకీ టోర్నీకి ప్రపంచ చాంపియన్ల హోదాలో అర్హత సాధించేందుకు మన జట్టు ఎంతో స్ఫూర్తిని, ధృఢ సంకల్పాన్ని ప్రదర్శించడం శ్లాఘనీయం’ అని ముస్తాక్ అహ్మద్ కొనియాడారు.

చిత్రం..జట్టు ప్రధాన కోచ్ హరేంద్ర సింగ్