క్రీడాభూమి

పిలవని పేరంటానికి చౌతాలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: కళంకిత భారత ఒలింపిక్ సంఘ (ఐఓఏ) మాజీ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఐఓఏ కార్యవర్గ మండలి సమావేశంలో ప్రత్యక్షమయ్యాడు. ఎటువంటి ఆహ్వానం లేకుండానే ఆయన ఈ సమావేశానికి విచ్చేశాడు. అయితే చౌతాలా రాక పట్ల కొంత మంది ఐఓఏ సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో వెంటనే ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయాడు. 2012లో చౌతాలా వివాదాస్పద రీతిలో ఐఓఏ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఆ ఎన్నిక చెల్లదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఇక్కడి ఐఓఏ భవనంలో జరిగిన కార్యవర్గ మండలి సమావేశంలోకి దూసుకొచ్చిన చౌతాలా, దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే కూర్చున్నాడు. దీనిపై ఐఓఏ కార్యవర్గ మండలి సభ్యుడు జిఎస్.మందర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, సభ్యులు కానివారిని సమావేశం నుంచి బహిష్కరించాల్సిందిగా అధ్యక్షుడిని కోరాడు. దీంతో ఐఓఏ సభ్యులు కానివారు ఏమి మాట్లాడినా దానిని రికార్డు చేయరాదని ఈ సమావేశం తీర్మానించింది.
ఈ వ్యవహారంపై ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా మాట్లాడుతూ, చౌతాలాను ఈ సమావేశానికి ఎవరూ ఆహ్వానించలేదని చెప్పాడు. ‘ఈ సమావేశానికి మేము ఆయనను ఆహ్వానించలేదు. చౌతాలా తనంతట తానే ఈ సమావేశానికి వచ్చి దాదాపు 10 నిమిషాల పాటు ఐఓఏ భవన్‌లోనే కూర్చున్నాడు. దీనిపై ఐఓఏ కార్యవర్గ మండలి సభ్యుడు మందర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో సమావేశ మందిరం నుంచి చౌతాలా వెళ్లిపోయాడు. మేము ఆయనను బయటికి నెట్టేయలేము. అయితే సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత చౌతాలా అక్కడి నుంచి వెనుదిరిగాడు’ అని రాజీవ్ మెహతా స్పష్టం చేశాడు. కాగా, ఈ సమావేశానికి ఎందుకు వచ్చావని చౌతాలాను ప్రశ్నించగా, కొంత మంది వ్యక్తులను కలసి వారికి ‘హలో’ చెప్పేందుకే వచ్చానన్నాడు. 2012 డిసెంబర్‌లో భారత ఒలింపిక్ సంఘ అధ్యక్షుడిగా అభయ్ సింగ్ చౌతాలా, ప్రధాన కార్యదర్శిగా లలిత్ భానోత్ ఎన్నికవడంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2014 ఫిబ్రవరి వరకు ఐఓఏపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పాటు జైలు శిక్ష అనుభవించదగ్గ నేరాలకు పాల్పడిన వారు ఐఓఏ ఆఫీస్ బేరర్లుగా ఎన్నిక కాకుండా నిరోధించేందుకు భారత ఒలింపిక్ సంఘం తన రాజ్యాంగాన్ని (నిబంధనావళిని) సవరించాల్సి వచ్చింది.

చిత్రం..ఐఓఏ సమావేశంలో ప్రత్యక్షమైన అభయ్