క్రీడాభూమి

మేరీ కోమ్.. ఆరోసారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోచిమిన్ సిటీ (వియత్నాం), నవంబర్ 7: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ బాక్సర్, రాజ్యసభ సభ్యురాలు మేరీ కోమ్‌తో పాటు సోనియా లాథర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. గతంలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ మంగళవారం ఇక్కడ పూర్తి ఏకపక్షంగా ముగిసిన మహిళల 48 కిలోల విభాగం సెమీ ఫైనల్ బౌట్‌లో 5-0 తేడాతో జపాన్‌కు చెందిన త్సుబసా కొమురాను మట్టికరిపించి ఆసియా చాంపియన్‌షిప్స్‌లో ఐదోసారి పసిడి పతకాన్ని కైవసం చేసుకునేందుకు చేరువైంది. ఈ ఈవెంట్‌లో ఆరుసార్లు పాల్గొన్న మేరీ కోమ్ ఫైనల్‌కు చేరడం ఇది ఐదోసారి. బుధవారం జరుగనున్న ఫైనల్ బౌట్‌లో ఆమె ఉత్తర కొరియా బాక్సర్ కిమ్ హియంగ్ మితో అమీతుమీ తేల్చుకోనుంది. మహిళల 48 కిలోల విభాగంలో జరిగిన మరో సెమీ ఫైనల్ బౌట్‌లో కిమ్ మంగోలియాకు చెందిన నాందిన్‌సెత్సెగ్ మయగ్మర్దులమ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. కిమ్‌పై బుధవారం మేరీ కోమ్ విజయం సాధించగలిగితే ఆసియా చాంపియన్‌షిప్స్ 48 కిలోల విభాగంలో తొలిసారి పసడి పతకాన్ని కైవసం చేసుకున్నట్లవుతుంది. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మేరీ కోమ్ ఐదేళ్ల పాటు 51 కిలోల విభాగం (2012 ఒలింపిక్ కేటగిరీ)లో అదృష్టాన్ని పరీక్షంచుకున్న తర్వాత తనకు ఎంతో ఇష్టమైన 48 కిలోల విభాగంలోకి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.
స్వర్ణానికి చేరువైన సోనియా
కాగా, మహిళల 57 కిలోల విభాగంలో భారత బాక్సర్ సోనియా లాథర్ కూడా స్వర్ణ పతకానికి చేరువైంది. హర్యానాకు చెందిన సోనియా లాథర్ సెమీ ఫైనల్ బౌట్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన యొద్గొరోయ్ మీర్జాయెవాపై విజయం సాధించింది. ఈ విజయం కోసం తీవ్రస్థాయిలో చెమటోడ్చిన సోనియా లాథర్ బుధవారం జరిగే ఫైనల్ బౌట్‌లో చైనా బాక్సర్ ఇన్ జున్హువాతో తలపడనుంది. ఇదిలావుంటే, ఈ చాంపియన్‌షిప్స్‌లో మెడల్ రౌండ్‌కు చేరుకున్న మరో ఐదుగురు భారత మహిళా బాక్సర్లు కాంస్య పతకాలతో సరిపుచ్చుకున్నారు. మంగళవారం సెమీ ఫైనల్స్‌లో జరిగిన 64 కిలోల కేటగిరీ బౌట్‌లో ఎల్.సరితా దేవి, 60 కిలోల విభాగం బౌట్‌లో ప్రియాంక చౌదరి, 69 కిలోల కేటగిరీ బౌట్‌లో లవ్లినా బొర్గొహైన్, 81+ కిలోల విభాగం బౌట్‌లో సీమా పునియా, 54 కిలోల కేటగిరీ బౌట్‌లో శిక్షా తమతమ ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలవడంతో వారికి కాంస్య పతకాలు లభించాయి.

చిత్రం..మరోసారి సత్తా చాటిన మేరీ కోమ్