క్రీడాభూమి

వార్నర్‌తోనే సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, నవంబర్ 9: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, హార్డ్ హిట్టర్ డేవిడ్ వార్నర్‌తోనే తమకు ఎక్కువ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. గురువారం అతను విలేఖరులతో మాట్లాడుతూ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వార్నర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాడు. ఇంగ్లాండ్‌తో యుద్ధం జరుగుతుందని, అందుకే, ఆ జట్టు పట్ల ఎంత అసహ్యం పెంచుకుంటే అంతగా రాణించగలుగుతామని వార్నర్ తన సహచరులకు సూచించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇలాంటి వ్యాఖ్యలు జరగబోయే పరిణామాలకు అద్దం పడతాయని అన్నాడు. సహజంగానే మైదానంలో దూకుడుగా ఉండే వార్నర్ ఇప్పుడు ప్రతి విషయంలోనూ మరింత తీవ్రంగా స్పందించే అవకాశం ఉందన్నాడు. వార్నర్‌ను ఎంత త్వరగా ఔట్ చేస్తే, అంత మంచిదని అన్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే, కొత్త బంతితో వార్నర్‌ను పెవిలియన్ దారి పట్టించాలని, లేకపోతే అతను క్రీజ్‌లో నిలదొక్కుకొని విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనసాగిస్తాడని బ్రాడ్ అన్నాడు. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా యాషెస్ సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగుతుందన్నాడు.