క్రీడాభూమి

పాక్‌లో పర్యటనపై వెస్టిండీస్ వెనుకంజ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, నవంబర్ 9: పాకిస్తాన్‌లో పర్యటించే విషయంలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు వెనుకంజ వేసినట్టు సమాచారం. వచ్చే ఏడాది మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్ ఆడేందుకు రావాల్సిందిగా విండీస్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆహ్వానించింది. అందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) తొలుత సానుకూలంగానే స్పందించింది. అయితే, పాక్‌లో భద్రతపై కొంత మంది క్రికెటర్లు అనుమానాలు వ్యక్తం చేయడంతో మనసు మార్చుకున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతానికి టూర్‌ను వాయిదా వేసుకుంటున్నట్టు డబ్ల్యుఐసిబి నుంచి సమాచారం అందినట్టు పిసిబి అధికారి ఒకరు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బృందంతోపాటు, వెస్టిండీస్ అధికారులు కూడా పాక్‌లో ఆటగాళ్ల భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారని అన్నాడు. అయితే, విండీస్ క్రికెటర్లు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయాడు. ఇలావుంటే, తరచు ఉగ్రవాద దాడులు జరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్‌లో పర్యటించేందుకు ప్రపంచ దేశాలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. వెస్టిండీస్ జట్టు పాక్‌లో పర్యటిస్తే, పరిస్థితి కొంత మెరుగు పడుతుందని పిసిబి భావిస్తున్నది. కానీ, విండీస్ క్రికెటర్లు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించడం లేదన్న వార్త వారిని ఆందోళనకు గురి చేస్తున్నది.