క్రీడాభూమి

కౌల్టర్ నైల్ ఔట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, నవంబర్ 10: ఇంగ్లాండ్‌తో జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ దూరమయ్యాడు. చాలాకాలంగా వేధిస్తున్న వెన్నునొప్పి మరోసారి తిరగబెట్టడంతో అతను ఈనెల 23 నుంచి మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల యాషెస్ టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) స్పోర్ట్స్ మెడిసిన్ మేనేజర్ అలెక్స్ కౌంటోరిస్ తెలిపాడు. 30 ఏళ్ల కౌల్టన్ నైల్ వెన్నునొప్పి, కండారులు చిట్లడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. ఫలితంగా చాలా సిరీస్‌ల్లో అతను పాల్గొనలేకపోతున్నాడు. తాజాగా మరోసారి ఫిట్నెస్ సమస్య అతనిని వేధిస్తున్నది. గతంలో బాధించిన వెన్నునొప్పి తిరగబెట్టినట్టు వైద్య పరీక్షల్లో స్పష్టమైందని కౌంటోరిస్ ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే, సమస్యను ఆరంభంలోనే గుర్తించడంతో, తొందరలోనే అతను పూర్తి ఫిట్నెస్‌ను సంపాదించే అవకాశం ఉందన్నాడు.
కెరీర్‌లో టెస్టు మ్యాచ్ ఆడే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన కౌల్టన్ నైల్ 21 వనే్డలు, 19 టి-20 ఇంటర్నేషనల్స్‌లో ఆడాడు.

చిత్రం..నాథన్ కౌల్టర్ నైల్