క్రీడాభూమి

సీఏ ఎలెవెన్‌పై ఇంగ్లాండ్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్ ఓవల్, నవంబర్ 11: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవెన్‌తో జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ని ఇంగ్లాండ్ 192 పరుగుల తేడాతో గెల్చుకుం ది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా సీఏ ఎలెవెన్ 76 ఓవర్లలో 9 వికె ట్లకు 233 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నిం గ్స్‌లో ఇంగ్లాండ్ 67.4 ఓవర్లలో 207 పరుగులు సాధించగలిగింది. మార్క్ స్టో న్‌మన్ (51), జానీ బెయర్‌స్టో (61) అర్ధ శతకాలను మినహాయస్తే మిగతా వా రు ఎవరూ అనుకున్న రీతిలో ఆడలేకపోయారు. అయతే, బ్యాటింగ్ వైఫల్యా లను ఇంగ్లాండ్ అద్భుత బౌలింగ్‌తో సరిదిద్దుకుంది. సీఏ ఎలెవెన్‌ను 40.2 ఓవ ర్లలో కేవలం 75 పరుగులకే కుప్పకూల్చింది. మాథ్యూ షార్ట్ (28), గురీందర్ సంధు (14) తప్ప ఎవరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయా రు. క్రిస్ వోక్స్ 17 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్ విజయం లో కీలక భూమిక పోషించాడు.