క్రీడాభూమి

బేట్స్ హాఫ్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షార్జా, నవంబర్ 12: మహిళల టి-20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ విజయభేరి మోగించింది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అప్పటికే ఆధిక్యాన్ని సంపాదించిన న్యూజిలాండ్ మహిళల జట్టు మూడో టి-20లోనూ అదే దూకుడును కొనసాగించింది. సూజీ బేట్స్ 57 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 126 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ మహిళల జట్టు 19 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది. కివీస్ మహిళల జట్టు 42 పరుగుల తేడాతో విజయభేరి మోగించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ మహిళలు: 20 ఓవర్లలో 4 వికెట్లకు 126 (సూజీ బేట్స్ 65 నాటౌట్, కాటే మార్టిన్ 25, నతాలియా పెర్వెజ్ 2/12).
పాకిస్తాన్ మహిళలు: 19 ఓవర్లలో 84 ఆలౌట్ (నహిదా ఖాన్ 23, సిద్రా అమీన్ 16, హనా రోవ్ 3/16, అమెలియా కెర్ 2/8).