క్రీడాభూమి

శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 12: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత బ్యాటింగ్ శ్రీలంక బౌలర్లను ఆందోళనకు గురి చేసింది. శాంసన్ సెంచరీ సాధించగా, శ్రీలంకతో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి రోజును శ్రీలంక బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్‌గా మార్చుకున్న శ్రీలంక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 411 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే. రెండో రోజున అదే స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీనితో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన బోర్డు ప్రెసిడెంట్స్ జట్టు 27 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను తన్మయ్ అగర్వాల్ (16) రూపంలో కోల్పోయింది. ఆకాష్ భండారీ కేవలం మూడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వీరిద్దరి వికెట్లను లాహిరి తిరిమానే సాధించడం గమనార్హం. అనంతరం జీవన్‌జోత్ సింగ్, శాంసన్ జట్టును ఆదుకున్నరు. జీవన్‌జోత్ 35 పరుగులు చేసి ఔట్‌కాగా, రోహన్ ప్రేమ్ 39 పరుగులు చేసి వెనుదిరిగాడు. క్రీజ్‌లో పాతుకుపోయి, 227 నిమిషాలు బ్యాటింగ్ చేసిన శాంసన్ 143 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 128 పరుగులు చేసి, సదీర సమరవిక్రమ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లాకు దొరికిపోయాడు. 75 ఓవర్ల తర్వాత, మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి బోర్డు ప్రెసిడెంట్స్ జట్టు 5 వికెట్లకు 287 పరుగులు చేసింది. అప్పటికి సందీప్ 33, జలజ్ సక్సేనా 33 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
సంక్షిప్త స్కోరుబోర్డు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 88 ఓవర్లలో 6 వికెట్లకు 411 డిక్లేర్డ్ (సదీర సమరవిక్రమ 74, దిముత్ కరుణరత్నే 50 రిటైర్డ్ హర్ట్, ఏంజెలో మాథ్యూస్ 54 రిటైర్డ్ హర్ట్, నిరోషన్ డిక్‌విల్లా 73 బ్యాటింగ్, దిల్‌రువాన్ పెరెరా 48, సందీప్ వారియర్ 2/60, ఆకాశ్ భండారీ 2/11, అవేష్ ఖాన్ 1/68, జలజ్ సక్సేనా 1/100).
బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ మొదటి ఇన్నింగ్స్: 75 ఓవర్లలో 5 వికెట్లకు 287 (జీవన్‌జోత్ సింగ్ 35, రోహన్ ప్రేమ్ 39, సంజూ శాంసన్ 128, సందీప్ 33 నాటౌట్, జలజ్ సక్సేనా 20 నాటౌట్, లాహిరు తిరిమానే 2/22).

చిత్రం..శతకంతో రాణించిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ కెప్టెన్ సంజూ శాంసన్