క్రీడాభూమి

‘లెజెండ్’ ధోనీ కెరీర్‌పై వ్యాఖ్యలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 14: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జట్టు ప్రధాన కోచ్ రవిశాస్ర్తీ మరోసారి గట్టిగా మద్దతు తెలిపాడు. దేశానికి రెండుసార్లు ప్రపంచ కప్ క్రికెట్ టైటిళ్లను అందించి చరిత్ర సృష్టించిన ధోనీ భవిష్యత్తు గురించి మాట్లాడే వారంతా ముందు తమ భవిష్యత్తు ఏమిటో ఆలోచించుకోవాలని రవిశాస్ర్తీ స్పష్టం చేశాడు. ట్వంటీ-20 క్రికెట్‌లో ధోనీ భవితవ్యం గురించి ‘హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్‌మన్’ వివిఎస్.లక్ష్మణ్, అజిత్ అగార్కర్ లాంటి కొంత మంది భారత మాజీ క్రికెటర్లు ప్రస్తుతం ప్రశ్నలను లేవనెత్తుతుండటం దేశ క్రికెట్ వర్గాల్లో పెను దుమారాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో రవిశాస్ర్తీ పై వ్యాఖ్యలు చేశాడు. ‘్ధనీపై వ్యాఖ్యలు చేసేవారంతా ముందు తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. క్రికెట్‌లో ధోనీ ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంది. ఈ లెజెండ్‌కు అండగా నిలవాల్సి బాధ్యత జట్టుపై ఉంది’ అని రవిశాస్ర్తీ పేర్కొన్నాడు. 2011లో ప్రపంచ కప్ వనే్డ క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకున్నప్పుడు భారత జట్టు సభ్యులంతా సంతకాలు (ఆటోగ్రాఫ్‌లు) చేసిన బ్యాట్‌ను వీక్షిస్తూ రవిశాస్ర్తీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ బ్యాటు కోల్‌కతాలోని స్పోర్ట్స్ మ్యూజియంలో ఉంది. ప్రస్తుతం ప్రతిభ, నాణ్యతపైనే భారత జట్టు సంస్కృతి ఆధారపడి ఉందని, ఆటపై ధ్యాసతో చురుకుగా వ్యవహరిస్తూ మైదానంలో ధోనీ కంటే ఉత్తమంగా రాణించగలిగే వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ ప్రస్తుతానికి మరెవరూ లేరని రవిశాస్ర్తీ పేర్కొన్నాడు. అలాగే భారత క్రికెట్ జట్టు సభ్యుల క్రీడా స్ఫూర్తిని, సమష్టితత్వాన్ని అతను ప్రశంసిస్తూ, ప్రపంచంలో ప్రస్తుతం ఫీల్డింగ్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నది భారత జట్టేనని, గతంలోని భారత జట్లకు, ఇప్పుడున్న భారత జట్టుకు ప్రధానమైన తేడా ఇదేనని తెలిపాడు. ప్రస్తుతం భారత జట్టు స్వదేశంలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టెస్టు క్రికెట్ సిరీస్‌లో ఆడబోతున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్‌తో ఈ సిరీస్ మొదలవుతుంది. జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్ర్తీ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో టీమిండియా ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ ఇదే. అయితే ఈడెన్ గార్డెన్‌లో ఎప్పుడూ భారత జట్టుదే పైచేయిగా ఉంటుందని, దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు భారత జట్టు ఈ సిరీస్‌లో విజయం సాధించి సత్తా చాటుకుంటుందని ఆశిస్తున్నామని రవిశాస్ర్తీ చెప్పాడు. ఈ సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యకు విశ్రాంతి కల్పించడంపై అతను స్పందిస్తూ, భారత జట్టు కేవలం ఏ ఒక్కరికో పరిమితమైనది కాదని, టీమిండియా ఓడినా, గెలిచినా అది సమష్టి ఫలితమేనని అన్నాడు. అంతకుముందు రవిశాస్ర్తీ టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌తో కలసి దాదాపు రెండు గంటల పాటు స్పోర్ట్స్ మ్యూజియంలో గడిపాడు.