క్రీడాభూమి

స్టార్ అట్రాక్షన్ సుశీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, నవంబర్ 15: లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్, ఇటీవల కాలంలో సంచలన విజయాలతో దూసుకెళుతున్న భజరంగ్ పునియా తదితరులు బరిలో లేకపోవడంతో, గురువారం నుంచి మొదలయ్యే జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సుశీల్ కుమార్ స్టార్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. రెండు పర్యాయాలు ఒలింపిక్ పతకాలు సాధించిన సుశీల్ సుమారు మూడు సంవత్సరాలుగా రెజ్లింగ్ పోటీలకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే అతనుజార్జియాలోని బిలిసీలో శిక్షణ పొంది, జాతీయ చాంపియన్‌షిప్ కోసం స్వదేశానికి వచ్చాడు. రైల్వేస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను వచ్చే ఏడాది జరిగే కామనె్వల్త్, ఆసియా క్రీడల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నాడు. అందుకే, ఫామ్‌ను, ఫిట్నెస్‌ను నిరూపించుకోవడానికి జాతీయ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్నాడు. ట్రయల్స్‌కు హాజరుకాని కారణంగా రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని సుశీల్ కోల్పోయిన విషయం తెలిసిందే. తనను ఎంపిక చేయాలని కోరుతూ అతను కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అలాంటి పరిస్థితి మరోసారి ఎదురుకాకూడదన్న ఆలోచన కూడా అతనిలో ఉంది. అందుకే, జాతీయ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్నాడు. ఇలావుంటే, మహిళల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, గీతా ఫొగట్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పలువురు మేటి రెజ్లర్లు ఈ పోటీలకు దూరంగా ఉండడం అభిమానుల ను నిరాశ పరుస్తున్నది. బాడ్మింటన్, టెన్నిస్‌లో మాదిరిగానే రెజ్లింగ్‌లోనూ జాతీయ చాంపియ న్‌షిప్‌లో తప్పనిసరిగా పాల్గొనాలన్న నిబంధన రావాల్సిన అవసరం ఉందని, లేకపోతే, ఇదే తంతు కొనసాగుతుందని అభిమానులు వ్యా ఖ్యానిస్తున్నారు.