క్రీడాభూమి

ఎస్‌జీఎం నోటీసివ్వండి బీసీసీఐకి సీఓఏ ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: లోధా సిఫార్సుల అమలుకు తీసుకోవాల్సిన చర్చలపై చర్చించి, తదనుగుణంగా తీర్మానాలను ఆమోదించేందుకు వార్షిక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)ను నిర్వహించాలని, అందుకు సంబంధించిన నోటీసును గురువారంలోగా విడుదల చేయాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)ని పాలకాధికారుల బృందం (సీఓఏ) ఆదేశించింది. సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడించాలని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నాకు పంపిన ఈ-మెయిల్‌లో సీఓఎ చీఫ్ వినోద్ రాయ్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఖన్నా ధ్రువీకరించాడు. మిగతా అధికారులతో చర్చిస్తున్నామని, ఎస్‌జీఎం తేదీని నిర్ణయించి, నోటీసు జారీ చేస్తామని బుధవారం పీటీఐతో మాట్లాడుతూ తెలిపాడు. నోటీసు విడుదల చేసిన తేదీ నుంచి సమావేశం తేదీకి కనీసం పది రోజుల వ్యవధి ఉండాలని అన్నాడు. ఎజెండాను ఖరారు చేయాల్సి ఉంటుంది కాబట్టి, కార్యవర్గంలోని మిగతా సభ్యులతోనూ చర్చిస్తున్నానని అన్నాడు. సీఓఏ సూచించిన విధంగానే ఎస్‌జీఎం నోటీసును జారీ చేస్తామని తెలిపాడు.