క్రీడాభూమి

చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న అఫ్గానిస్తాన్ ఆటగాళ్ల ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న అఫ్గానిస్తాన్ ఆటగాళ్ల ఆనందం. ఫైనల్‌లో ఈ జట్టు పాకిస్తాన్‌ను 185 పరుగుల ఆధిక్యంతో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు సాధించింది. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ ఇక్రామ్ ఫైజీ 107 పరుగులతో రాణించాడు. అనంతరం పాకిస్తాన్ 22.1 ఓవర్లలో 63 పరుగులకే కుప్పకూలింది. మహమ్మద్ తహా (19), హసన్ ఖాన్ (10) తప్ప ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేదు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ 13 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టగా, కాయిస్ అహ్మద్ 18 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు