క్రీడాభూమి

ఆసక్తి రేపుతున్న కోట్లా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఫిరోజ్ షా కోట్లా మైదానం ఆసక్తిని రేపుతున్నది. మిగతా స్టేడియాల్లో మాదిరిగానే, గతంలో కోట్లా పిచ్‌ని కూడా స్పిన్‌కు అనుకూలంగా తీర్చిదిద్దేవారు. కానీ, రాబోయే దక్షిణాఫ్రికా టూర్‌ను దృష్టిలో ఉంచుకొని, పిచ్‌ని సీమర్లకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బహిరంగంగానే కోరవడంతో, ఆ తరహా పిచ్‌లను సిద్ధం చేస్తున్నారు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానం బ్యాట్స్‌మెన్‌కు సింహ స్వప్నంగా నిలవగా, నాగపూర్‌లోని విదర్భ క్రికెట్ సంఘం పిచ్ బౌలర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కోట్లా వికెట్‌ను చూస్తు, అటు ఈడెన్, ఇటు నాగపూర్ మాదిరి కాకుండా సమతూకంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. టెస్టులకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ప్రకటించింది. పిచ్ ఆరంభంలో ఎలా ఉంటుంది? తర్వాత ఎలా మారు తుంది? అన్న ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. గతంలో కోట్లా పిచ్‌పై పగుళ్లు ఉండడంతో, బ్యాట్స్‌మెన్ తీవ్రంగా గాయపడే ప్రమాదం పొంచి ఉండేది. కానీ, ఇప్పుడు పిచ్‌పై పచ్చిక కనిపిస్తున్నది. సరికొత్తగా కనిపిస్తున్న ఈ వికెట్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.