క్రీడాభూమి

విజయవంతంగా సాకర్ వరల్డ్ కప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రెమ్లిన్, డిసెంబర్ 1: సాకర్ వరల్డ్ కప్‌ను విజయవంతమవుతుందని, ఇందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, ఈ మెగా ఈవెంట్‌కు వివిధ దేశాల అధికారులు, అభిమానులను ఆహ్వానిస్తున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అన్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది రష్యాలో జరిగే సాకర్ వరల్డ్ కప్ టోర్నీ డ్రాను అధికారికంగా ప్రారంభించిన అతను మాట్లాడుతూ, మొత్తం 11 నగరాలు దీని కోసం అన్ని విధాలా సిద్ధమవుతున్నాయని అన్నాడు. వరల్డ్ కప్‌ను సమర్థంగా నిర్వహించడానికి శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పాడు. ‘్ఫఫా’ అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో మాట్లాడుతూ, రష్యాలో వచ్చే ఏడాది జూన్ 14 నుంచి జూలై 15 వరకు జరిగే వరల్డ్ కప్ విజయవంతమవుతుందని జోస్యం చెప్పాడు. రష్యాలో ప్రతి ఒక్కరూ వరల్డ్ కప్ కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని, వారందరినీ అభినందిస్తున్నానని చెప్పాడు. ఇలావుంటే, వరల్డ్ కప్‌లో మొత్తం 32 జట్లు పోటీపడతాయి. 64 మ్యాచ్‌లు జరుగుతాయి. 1986లో గోల్డెన్ బూట్‌ను సాధించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ గారీ లీనేకర్ వరల్డ్ కప్ డ్రా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. పీలే, డిగోమారడోనా, లారెంట్ బ్లాన్క్, కఫూ, ఫాబియో కానవారో, డిగో ఫొర్లాన్, కార్లెస్ పయోల్ వంటి హేమీహేమీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోవియట్ లీగ్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన 91 ఏళ్ల నికితా సిమొన్యన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
వేలాది మంది అభిమానులు, అధికారులు, క్రీడాకారుల హర్షధ్వానాల మధ్య, వరల్డ్ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు మరొస్లావ్ క్లోస్ ట్రోఫీని వేదికపైకి తీసుకొచ్చాడు. ఆహూతుల ప్రసంగాలు ముగిసిన తర్వాత, క్లోస్ వరల్డ్ కప్ ట్రోఫీని తీసుకురావడంతో, డ్రా ప్రక్రియ అధికారికంగా జరిగింది.
గ్రూప్ ‘ఎఫ్’లో జర్మనీ
క్రెమ్లిన్: డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ గ్రూప్ ‘ఎఫ్’ నుంచి 2018 సాకర్ వరల్డ్ కప్‌లో పోటీపడుతుంది. శుక్రవారం ఇక్కడ అట్టహాసంగా జరిగిన డ్రాలో మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఆతిథ్య దేశమైన రష్యా గ్రూప్ ‘ఏ’లో ఉండగా, 2014 వరల్డ్ కప్‌ను నిర్వహించిన బ్రెజిల్‌కు గ్రూప్ ‘ఈ’లో చోటు దక్కింది.
వరల్డ్ కప్ గ్రూప్‌లు ఇవే..
గ్రూప్ ‘ఏ’: 1. రష్యా, 2. ఉరుగ్వే, 3. ఈజిప్టు, 4. సౌదీ అరేబియా.
గ్రూప్ ‘బీ’: 1. పోర్చుగల్, 2. స్పెయిన్, 3. ఇరాన్, 4. మోరాకో.
గ్రూప్ ‘సీ’: 1. ఫ్రాన్స్, 2. పెరూ, 3. డెన్మార్క్, 4. ఆస్ట్రేలియా.
గ్రూప్ ‘డీ’: 1. అర్జెంటీనా, 2. క్రొయేషియా, 3. ఐస్‌లాండ్, 4. నైజీరియా.
గ్రూప్ ‘ఈ’: 1. బ్రెజిల్, 2. స్విట్జర్లాండ్, 3. కోస్టారికా, 4. సెర్బాయా.
గ్రూప్ ‘ఎఫ్’: 1. జర్మనీ, 2. మెక్సికో, 3. స్వీడన్, 4. దక్షిణ కొరియా.
గ్రూప్ ‘జీ’: 1. బెల్జియం, 2. ఇంగ్లాండ్, 3. ట్యునీషియా, 4. పనామా.
గ్రూప్ ‘హెచ్’: 1. పోలాండ్, 2. కొలంబియా, 3. సెనెగల్, 4. జపాన్.

చిత్రం..సాకర్ వరల్డ్ కప్ డ్రా సందర్భంగా ప్రసంగిస్తున్న ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్