క్రీడాభూమి

కాలుష్యంపై హంగామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉందంటూ శ్రీలంక క్రికెటర్లు మరోసారి హంగామా చేశారు. మ్యాచ్ రెండో రోజు, ఆదివారం కెప్టెన్ దినేష్ చండీమల్‌సహా ఆటగాళ్లంతా ముఖాలకు మాస్క్‌లు కట్టుకొని మైదానంలో దిగితే, సోమవారం బ్యాటింగ్ చేసిన ఏంజెలో మాథ్యూస్, చండీమల్ మరోసారి అంపైర్లకు అదే ఫిర్యాదు చేశారు. తాను ఊపిరి పీల్చుకోలేకపోతున్నానని పేర్కొంటూ డ్రెస్సింగ్ రూమ్‌కు చండీమల్ సంకేతాలు అందించాడు. జట్టు ఫిజియో, ఇతర సభ్యులు వెంటనే మైదానంలోకి పరుగులుతీసి, అతనికి ఉపచారాలు చేశారు. వైద్య సేవల అనంతరం ఆట తిరిగి కొనసాగింది. ఇలావుంటే, ఢిల్లీలో వాయుకాలుష్యం చాలా తీవ్ర స్థాయిలో ఉందని, దానిని భరించడం చాలా కష్టంగా ఉందని శ్రీలంక జట్టు కోచ్ నిక్ పొథాస్ వ్యాఖ్యానించాడు. వాంతులు చేసుకునే స్థితిలో లంక క్రికెటర్లు ఆటను కొనసాగిస్తున్నారని అతను ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.