క్రీడాభూమి

చండీమల్, మాథ్యూస్ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: మరోసారి అత్యంత నాటకీయంగా వాయు కాలుష్యం, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యల ప్రస్తావించిన శ్రీలంక, మూడవ, చివరి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 356 పరుగులు చేసింది. భారత్ కంటే ఈ జట్టు ఇంకా 180 పరుగును వెనుకంజలో నిలవగా, కేవలం ఒక వికెట్ చేతిలో ఉంది. మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్‌తోపాటు సెంచరీ సాధించిన కెప్టెన్ దినేష్ చండీమల్ క్రీజ్‌లో ఉండడంతో శ్రీలంకకు ఈ స్కోరు సాధ్యమైంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌ను ఏడు వికెట్లకు 536 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక రెండో రోజు మూడు వికెట్లకు 131 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించింది. మాథ్యూస్, చండీమల్ భారీ స్కోరును నమోదు చేసే దిశగా జట్టును నడిపించారు. 181 పరుగులు జోడించి, ప్రమాదకరంగా కనిపించిన ఈ భాగస్వామ్యాన్ని రవిచంద్రన్ అశ్విన్ ఛేదించాడు. వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సహా క్యాచ్ పట్టగా ఔటైన మాథ్యూస్ 268 బంతుల్లో, 14 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేశాడు. గాయం కారణంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించలేకపోయిన సదీర సమరవిక్రమ ఫోర్త్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి 33 పరుగులు చేశాడు. అతనిని వృద్ధిమాన్ సాహా క్యాచ్ అందుకోగా ఇశాంత్ శర్మ ఔట్ చేయడంతో శ్రీలంక కష్టాల్లో పడింది. కెప్టెన్ చండీమల్ నిలదొక్కుకొని ఆడుతున్నప్పటికీ, రోషన్ సిల్వ (0), వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రోషన్ డిక్‌విల్లా (0), సురంగ లక్మల్ (5), లాహిరు గామగే (1) ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్ చేరారు. దీనితో, మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొమ్మిది వికెట్లు కోల్పోయింది. మారథాన్ ఇన్నింగ్స్‌లో 341 బంతులు ఎదుర్కొని, 18 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 147 పరుగులు చేసిన చండీమల్‌తోపాటు, ఏడు బంతులు ఎదుర్కొన్నప్పటికీ, పరుగుల ఖాతా తెరవని లక్షన్ సండాకన్ క్రీజ్‌లో ఉన్నాడు. మ్యాచ్ నాలుగో రోజు వీరిద్దరూ ఎన్ని పరుగులు జోడిస్తారో చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో, మాథ్యూస్, చండీమల్ సెంచరీలు చేసినప్పటికీ, లంకపై టీమిండియాదే పైచేయిగా కనిపిస్తున్నది.

చిత్రాలు..అజేయ శతకం: దినేష్ చండీమల్
* సెంచరీ వీరుడు ఏంజెలో మాథ్యూస్