క్రీడాభూమి

గుర్‌ప్రీత్‌పై సస్పెన్షన్ వేటు.. జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ తరఫున ఆడుతున్న భారత స్టార్ గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధుపై వేటు పడింది. అతనిని రెండు నెలల పాటు అన్ని స్థాయిల్లోని ఫుట్‌బాల్ మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేస్తున్నామని, అంతేగాక, మూడు లక్షల రూపాయల జరిమానా విధించామని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. ఐఎస్‌ఎల్‌లో భాగంగా న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గోవా ఆటగాడు మాన్యుయెల్ లాంజరొట్ బ్రూనోను గుర్‌ప్రీత్ ఉద్దేశపూర్వకంగానే తలతో ఢీకొట్టినట్టు విచారణలో స్పష్టమైనట్టు ఏఐఎఫ్‌ఎఫ్ తన ప్రకటనలో పేర్కొంది. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించింది.