క్రీడాభూమి

శ్రీలంక ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: భారత్‌తో ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న చివరి, మూడో టెస్టులో శ్రీలంక ఎదురీదుతోంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను ఐదు వికెట్లకు 246 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, 410 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక నాలుగో రోజు, మంగళవారం ఆట ముగిసే సమయానికి 31 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. చివరి రోజైన బుధవారం ఈ జట్టు భారత్ బౌలింగ్‌ను ఎంత వరకూ సమర్థంగా ఎదుర్కొని, చేతిలో ఉన్న ఏడు వికెట్లకు ఇంకా 379 పరుగులు సాధిస్తుందో చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాదే పైచేయిగా కనిపిస్తున్నది. శ్రీలంక విజయం మాట ఎలావున్నా, చివరి రోజు మొత్తం ఆలౌట్ కాకుండా జాగ్రత్త పడి, మ్యాచ్‌ని డ్రా చేసుకుంటే ఒక అద్భుతాన్ని సాధించనట్టే అవుతుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్‌ను ఏడు వికెట్లకు 536 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అందుకు సమాధానంగా మొదటి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన శ్రీలంక సోమవారం ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. మంగళవారం ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి, 135.3 ఓవర్లలో 373 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆటలోనే సెంచరీ చేసిన కెప్టెన్ దినేష్ చండీమల్ మంగళవారం 150 పరుగుల మైలురాయిని అధిగమించాడు. 361 బంతులు ఎదుర్కొన్న అతను 21 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 164 పరుగులు చేసి, ఇశాంత్ శర్మ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. దీనితో లంక ఇన్నింగ్స్‌కు తెరపడింది. మరో ఓవర్‌నైట్ నైట్ బ్యాట్స్‌మన్ లక్షన్ సండాకన్ 20 బంతులు ఎదుర్కొన్నప్పటికీ, పరుగుల ఖాతాను తెరవలేకపోవడం గమనార్హం. భారత బౌలర్లలో ఇశాంత్ శర్మ 98 పరుగులకు మూడు, రవిచంద్రన్ అశ్విన్ 90 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా చెరి రెండు వికెట్లు సాధించారు.
ధావన్, కోహ్లీ, రోహిత్ అర్ధ శతకాలు
మొదటి ఇన్నింగ్స్‌లో 163 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, 10 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను మురళీ విజయ్ రూపంలో కోల్పోయింది. అతను తొమ్మిది పరుగులు చేసి, వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా క్యాచ్ అందుకోగా, సురంగ లక్మల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న అజింక్య రహానే మరోసారి అభిమానులను నిరాశ పరిచాడు. 37 బంతులు ఎదుర్కొన్న అతను 10 పరుగులు చేసి, దిల్‌రువాన్ పెరెరా బౌలింగ్‌లో లక్షన్ సండాకన్‌కు చిక్కాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన చటేశ్వర్ పుజారాతో కలిసి ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టు స్కోరు వంద పరుగుల మైలురాయిని దాటించాడు. స్కోరు 106 పరుగుల వద్ద ధనంజయ డిసిల్వ బౌలింగ్‌లో ఏంజెలో మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటైన పుజారా 66 బంతుల్లో 49 పరుగులు చేశాడు. అతని స్కోరులో ఐదు ఫోర్లు ఉన్నాయి. టాప్ స్కోరర్‌గా నిలిచిన ధావన్ 91 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 67 పరుగులు సాధించాడు. లక్షన్ సండాకన్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించిన అతను సకాలంలో క్రీజ్‌లో చేరుకోలేక, వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా స్టంప్ చేయడంతో పెవిలియన్ చేరాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో కదంతొక్కిన కెప్టెన్ విరాట్ కోహ్లీ సరిగ్గా అర్ధ సెంచరీ చేసి వెనుదిరిగాడు. వేగంగా స్కోరును పెంచడమే లక్ష్యంగా ఎంచుకున్న అతను 58 బంతుల్లోనే 50 పరుగులు చేసి, లాహిరు గామగే బౌలింగ్‌లో సురంగ లక్మల్ క్యాచ్ అందుకోగా ఔటయ్యాడు. చివరిలో రోహిత్ శర్మ (49 బంతుల్లో 50 పరుగులు) అర్ధ శతకం పూర్తయిన వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు కోహ్లీ ప్రకటించాడు. అప్పటికి భారత్ స్కోరు 62.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 246 పరుగులు. రోహిత్‌తోపాటు రవీంద్ర జడేజా (4) నాటౌట్‌గా ఉన్నాడు. బౌలింగ్‌కు దిగిన ఐదుగురు బౌలర్లు, సురంగ లక్మల్, లాహిరు గామగే, దిల్‌రువాన్ పెరెరా, ధనంజయ డిసిల్వ, లక్షన్ సండాకన్, తలా ఒక వికెట్ పంచుకున్నారు.
భారత కెప్టెన్ కోహ్లీ 410 పరుగుల లక్ష్యాన్ని తమ ముందు ఉంచడం ద్వారా విసిరిన సవాలును స్వీకరించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను ఆచితూచి ఆడేందుకు ప్రయత్నించింది. అయితే, 14 పరుగుల వద్ద సదీర సమరవిక్రమ ఔట్ కావడంతో కంగుతిన్నది. 15 బంతులు ఎదుర్కొని, ఐదు పరుగులు చేసిన అతనిని అజింక్య రహానే క్యాచ్ పట్టగా మహమ్మద్ షమీ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత రవీంద్ర జడేజా ఒకే ఓవర్‌లో దిముత్ కరుణరత్నే (13), సురంగ లక్మల్ (0) వికెట్లను కూల్చడంతో శ్రీలంక కష్టాల్లో పడింది. విజయానికి ఆ జట్టు ఇంకా 379 పరుగులు చేయాలి. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి.
చిత్రం..శిఖర్ ధావన్