క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్‌కు సెరెనా సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 7: వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ బరిలోకి దిగడం ఖాయమని సమాచారం. ఈ ఏడాది జనవరిలో, గర్భవతిగానే సెరెనా ఈ టోర్నమెంట్ ఆడింది. సెప్టెంబర్‌లో అమ్మాయికి జన్మనిచ్చిన 36 ఏళ్ల సెరెనా మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించాలన్న పట్టుదలతో ఉందని స్థానిక వార్తా పత్రిక కథనం. ఆస్ట్రేలియా ఓపెన్‌తోనే తన కెరీర్‌లో రెండు ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తుందని ఆ పత్రిక పేర్కొంది. అయితే, సెరెనా ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.