క్రీడాభూమి

భారత్‌కు 5 పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాకో సిటీ (జపాన్), డిసెంబర్ 8: ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్స్ తొలి రోజున భారత్‌కు ఐదు పతకాలు లభించాయి. వీటిలో రెండు ఇండివిజువ్ ఈవెంట్స్‌లోకాగా, మూడు టీం ఈవెంట్స్‌లో దక్కాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్స్ విభాగంలో అర్జున్ బబుతా రజత పతకాన్ని అందుకోగా, సీనియర్స్ విభాగంలో రవి కుమార్‌కు కాంస్య పతకం లభించింది. వీటితోపాటు మూడు ఎయిర్‌రైఫిల్ టీం ఈవెంట్స్‌లో భారత్ రజత పతకాలను కైవసుం చేసుకుంది. కాగా, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ఒలింపిక్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ దారుణంగా విఫలమై, ఏడో స్థానంతో సంతృప్తి చెందాడు. అతను ఫామ్‌లో లేనట్టు స్పష్టమైంది.