క్రీడాభూమి

పెళ్లెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ వివాహం ఎప్పుడు? ఎక్కడ? ఎవరెవరు హాజరవుతారు? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలంకతో జరగనున్న వనే్డ, టి-20 సిరీస్‌ల నుంచి కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో, పెళ్లిపై ఊహాగానాలు పెరిగిపోతున్నాయ. ఈనెల 12న ఇటలీలోని మలాన్‌లో వీరి వివాహం జరుగుతుందని వార్తలు వస్తుంటే, కాదు... కాదు.. స్విట్జర్లాండ్‌లో పెళ్లు జరుగుతుందని మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. సచిన్ తెండూల్కర్, యువరాజ్ సింగ్ వంటి కొద్ది మందిని మాత్రమే పెళ్లికి కోహ్లీ ఆహ్వానించాడని, మిగతా వారికి ఈనెల 21న భారీ పార్టీ ఇవ్వనున్నాడనీ మరో సమాచారం. అయతే, ఇవేవీ అధికారిక వార్తలు కావు. కోహ్లీ, అనుష్య పెళ్లి వ్యవహారాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. దీనితో ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసుకుంటున్నారు.