క్రీడాభూమి

స్పానిష్ లీగ్ లా లిగాలో మెస్సీ జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, డిసెంబర్ 11: స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లిగాలో బార్సిలోనా సూపర్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ జోరు కొనసాగుతున్నది. విల్లారియల్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అతను 83వ నిమిషంలో ఒక గోల్ చేశాడు. అంతకు ముందు, 72వ నిమిషంలో లూయిస్ సొరెజ్ గోల్ సాధించాడు. దీనితో బార్సిలోనా రెండు గోల్స్‌తో ఆధిక్యాన్ని సంపాదించి, అదే తేడాతో మ్యాచ్‌ని ముగించింది. విల్లారియల్ ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. ఇలావుంటే, ఈ సీజన్‌లో మెస్సీ గోల్స్ ఖాతా 14కు చేరింది. ద్వితీయ స్థానంలో ఉన్న వలెన్షియా ఆటగాడు సిమోన్ జజా కంటే అతను నాలుగు గోల్స్ ఆధిక్యంలో ఉన్నాడు. లగో అస్పాస్ (సెల్టా విగో), సెడ్రిక్ బకాంబూ (విల్లారియల్) చెరి తొమ్మిది గోల్స్‌తో తృతీయ స్థానంలో ఉన్నారు.
ఇతర గ్రూప్ మ్యాచ్‌ల్లో, లెవాంటేను అథ్లెటిక్ బిల్బావో 2-1, రియల్ బెటిస్‌ను అథ్లెటికో మాడ్రిడ్ 1-0, రియల్ సోసియాడడ్‌పై మలగా 2-0 గోల్స్ తేడాతో ఓడించాయి.

చిత్రం..లియోనెల్ మెస్సీ