క్రీడాభూమి

టేలర్ రికార్డు శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, డిసెంబర్ 11: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌పై న్యూజిలాండ్ పట్టు బిగించింది. మాజీ కెప్టెన్ రాస్ టేలర్ రికార్డు శతకంతో రాణించడంతో, రెండో ఇన్నింగ్స్‌ను ఎనిమిది వికెట్లకు 291 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రత్యర్థి ముందు 414 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదటి ఇన్నింగ్స్‌లో 152 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన న్యూజిలాండ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో టేలర్ అజేయంగా 107 పరుగులు అందించాడు. టెస్టుల్లో అత్యధిక శతకాలు సాధించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ జాబితాలో మార్టిన్ క్రో, ప్రస్తుత కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ సరసన మొదటి స్థానాన్ని ఆక్రమించారు. వీరంతా తలా 17 టెస్టు సెంచరీలు చేశాడు. టేలర్ 83వ టెస్టులో 17వ శతకాన్ని సాధించగా, మార్టిన్ క్రో 77, విలియమ్‌సన్ 61 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరారు. కాగా, టేలర్‌తోపాటు కేన్ విలియమ్‌సన్ (54) కూడా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శనతో రాణించడంతో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 291 పరుగులకు చేరింది. అదే సమయంలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు విలియమ్‌సన్ ప్రకటించాడు.
న్యూజిలాండ్‌ను ఓడించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను డ్రా చేసుకోవాలన్న పట్టుదలతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెస్టిండీస్ మూడో రోజు, సోమవారం ఆట ముగిసే సమయానికి, 8 ఓవర్లలో 2 వికెట్లకు 30 పరుగులు చేసింది. విజయానికి ఈ జట్టు ఇంకా 414 పరుగుల దూరంగా నిలిచింది. ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి. విండీస్‌కు వైట్‌వాష్ వేయాలంటే, మిగతా రెండు రోజుల ఆటలో కివీస్ ఎనిమిది వికెట్లు పడగొట్టాలి. తగినంత సమయం ఉండడంతో, ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తున్నది.

చిత్రం..సెంచరీ సాధించిన రాస్ టేలర్