క్రీడాభూమి

ఈ ఏడాది అన్ని అద్భుతాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 14: ఈ ఏడాది టీమిండియా అద్భుత ప్రతిభ కనబరుస్తోందని, మునుముందు మరిన్ని విజయాలు అందుకుంటుదని క్రికెట్ జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. అన్ని ఫార్మట్లలో సభ్యులు పూర్తి స్థాయిలో రాణిస్తున్నందున విజయాలు సునాయాసంగా అందుకుంటున్నారని చెప్పాడు. ఈ దూకుడు ఇలానే కొనసాగిస్తే మరిన్ని అద్భుతాలు తప్పకుండా నమోదు కాగలవని ఆయన గురువారం విజయవాడలో విలేఖరులకు తెలిపాడు. మరో ఐదేళ్ల పాటు టీమిండియాకు తిరుగు లేదని తెలిపిన ఆయన విరాట్ గైర్హాజరీలో వనే్డ జట్టుకు తొలిసారి సారథ్య బాధ్యతలు వహిస్తున్న రోహిత్ శర్మ మంచి ప్రతిభ కనబరిచినట్లు చెప్పాడు. రోహిత్ శర్మ మూడో డబుల్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డును నమోదు చేయడం శుభపరిణామమన్నాడు. ఇది దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిగా తెలిపాడు. రోహిత్ రికార్డులను అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదని ఎమ్మెస్కే కొనియాడాడు.