క్రీడాభూమి

పట్టు బిగించిన దక్షిణాఫ్రికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఎలిజబెత్, డిసెంబర్ 27: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక డే/నైట్ టెస్టుపై దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. ఈ జట్టు మొదటి ఇన్నింగ్స్‌ను 78.3 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 309 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసింది. అయిదన్ మర్‌క్రామ్ 204 బంతులు ఎదుర్కొని, 14 ఫోర్లు, రెండు సిక్సర్లతో 125 పరుగులు చేయగా, ఏబీ డివిలియర్స్ 53, టెంబా బవూమా 44 పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో కేల్ జార్విస్, క్రిస్ మోఫూ చెరి మూడు వికెట్లు కూల్చారు. గ్రేమ్ క్రెమర్‌కు రెండు వికెట్లు లభించాయి. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన జింబాబ్వేను దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్ మోర్న్ మోర్కెల్ దారుణంగా దెబ్బతీశాడు. అతని ధాటికి తట్టుకోలేకపోయిన జింబాబ్వే బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా ఆ జట్టు 68 పరుగులకే కుప్పకూలింది. మోర్న్ మోర్కెల్ 21 పరుగులకు ఐదు వికెట్లు కూల్చాడు. కాగిసో రబదా, అదిలె ఫెహ్లూక్వాయో చెరి రెండు వికెట్లు సాధించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు వెనుకబడిన జింబాబ్వేకు ఫాలోఆన్ తప్పలేదు.
డికాక్‌కు విశ్రాంతి
జింబాబ్వేతో జరుగుతున్న డే/నైట్ టెస్టు క్రికెట్ మొదటి రోజుల ఆటలో కాలి కండరాలు బెణకడంతో ఇబ్బంది పడిన దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్‌కు విశ్రాంతి అనివార్యమని వైద్యులు స్పష్టం చేశారు. దీనితో అతను ఈ టెస్టులో మిగతా ఆటకు అందుబాటులో ఉండడని దక్షిణాఫ్రికా క్రికెట్ (ఎస్‌ఏసీ) ప్రకటించింది. అయితే, భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ ఆరంభం నాటికి అతను పూర్తిగా కోలుకుంటాడని ఎస్‌ఏసీ
ఆశాభావం వ్యక్తం చేసింది.