క్రీడాభూమి

బ్రిస్బేన్ టోర్నీ నుంచి వైదొలగిన నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, డిసెంబర్ 28: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. మోకాలి నొప్పితో బాధపడుతున్న కారణంగా ఈ టోర్నీకి దూరమైనట్టు అతను ట్విటర్ ద్వారా సమచారామిచ్చాడు. మోకాలి నొప్పి పూర్తిగా తగ్గలేదని, అందుకే, జనవరి 1 నుంచి 8వ తేదీ వరకు జరిగే బ్రిస్బేన్ టోర్నీకి ముందు జాగ్రత్త చర్యగా హాజరుకావడం లేదని నాదల్ తన ట్విటర్ అకౌంట్‌లో తెలిపాడు. జనవరి 15 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీకి ముందే పూర్తి ఫిట్నెస్‌తో ఉంటానని ధీమా వ్యక్తం చేశాడు.