క్రీడాభూమి

ఢిల్లీకి విదర్భ సవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, డిసెంబర్ 28: ఎనిమిదోసారి రంజీ ట్రోఫీ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఢిల్లీకి శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఫైనల్‌లో విదర్భ నుంచి పెను సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ జట్టు ఎవరూ ఊహించని రీతిలో విజయపరంపరలను కొనసాగించిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ కర్నాటకను సెమీ ఫైనల్‌లో ఓడించి, మొట్టమొదటిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌లోకి అడుగుపెట్టిన విదర్భకు ఫైజ్ ఫజల్ నాయకత్వ ప్రతిభ కొండంత అండ. వసీం జాఫర్, కర్న్ శర్మ వంటి ప్రతిభావంతులు ఆ జట్టులో ఉన్నారు. ఈ టోర్నీ మొత్తం మీద, ప్రత్యేకించి సెమీస్‌లో తిరుగులేని ప్రతిభ కనబరచిన మీడియం పేసర్ రజనీష్ గుర్బానీ నుంచి అభిమానులు మరోసారి అదే స్థాయి ఆటను ఆశిస్తున్నారు. రిషభ్ పంత్ నాయకత్వం వహిస్తున్న ఢిల్లీని ఓడించడం విదర్భకు సులభం కాదనేది వాస్తవం. అయితే, గట్టిపోటీనిచ్చి, ఢిల్లీకి సవాళ్లు విసిరే సత్తా విదర్భకు ఉంది. గౌతం గంభీర్, నితీష్ రాణా, నవ్‌దీప్ సైనీ, శివం శర్మ, ఉన్ముక్త్ చాంద్ తదితరులు తమ స్థాయికి తగినట్టు ఆడితే తప్ప, విదర్భను కట్టడి చేసి, రంజీ విజేతగా నిలవడం ఢిల్లీకి సాధ్యం కాదు.