క్రీడాభూమి

గెలిచే సత్తా నాకు ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఏటీపీ వరల్డ్ టూర్ టైటిల్‌ను సాధించే సత్తా తనకు ఉందని భారత టెన్నిస్ ఆటగాడు యుకీ భంబ్రీ ధీమా వ్యక్తం చేశాడు. 2015లో మొదటిసారి ప్రపంచ ర్యాంకింగ్స్ ‘టాప్-100’లోకి అడుగుపెట్టిన అతను ఈ ఏడాది పుణే చాలెంజర్స్ టైటిల్ గెల్చుకున్నాడు. బెంగళూరు ఓపెన్‌లో సెమీస్ వరకూ చేరాడు. అయితే, 22వ ర్యాంక్ ఆటగాడు గేల్ మోన్ఫిల్‌ను సిటీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఓడించడం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనగా పీటీఐతో మాట్లాడుతూ భంబ్రీ అభివర్ణించాడు. ఆ టోర్నీలో తాను క్వార్టర్స్ వరకూ వెళ్లగలిగానని చెప్పాడు. అనుభవం పెరుగుతున్నకొద్దీ ఆటతీరు మరింత మెరుగుపడుతున్నదని, వచ్చే ఏడాది ఏటీపీ టైటిల్‌ను సాధిస్తాననే అనుకుంటున్నానని తెలిపాడు.