క్రీడాభూమి

‘నంబర్ వన్’ స్థానమే నా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని చేరుకోవడమే వచ్చే ఏడాది తన ప్రధాన లక్ష్యమని భారత బాడ్మింటన్ స్టార్, ‘తెలుగు తేజం’ పీవీ సింధు స్పష్టం చేసింది. అయితే, ర్యాంకింగ్స్ కోసం ఒత్తిడికి లోనుకానని రెండు నెలల క్రితం తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా రెండో స్థానాన్ని సంపాదించి, ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్న సింధు తెలిపింది. ఉత్తమ ప్రదర్శనతో రాణిస్తే, నంబర్ వన్ స్థానం దానంతట అదే వస్తుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ర్యాంకింగ్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని, అదే సమయంలో నంబర్ వన్ క్రీడాకారిణిగా ఎదగాలని కోరుకుంటున్నానని 22 ఏళ్ల యువ సంచలనం సింధు పేర్కొంది. ఈ ఏడాది సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ, ఇండియన్ ఓపెన్, కొరియన్ ఓపెన్ టోర్నీల్లో టైటిళ్లను సాధించిన సింధు ప్రపంచ చాంపియన్‌షిప్స్, హాంకాంగ్ ఓపెన్, దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో రన్నరప్ ట్రోఫీలను అందుకుంది. స్థూలంగా చూస్తే ఈ ఏడాది తన ప్రస్థానం సంతృప్తికరంగానే సాగిందని చెప్పింది. అంతర్జాతీయ బాడ్మింటన్ సమాఖ్య కొత్తగా రూపొందించిన నిబంధనలను అనుసరించి, వచ్చే ఏడాది ఆడాల్సిన టోర్నమెంట్స్‌ను ఎంపిక చేసుకుంటానని చెప్పింది. కోచ్ గోపీచంద్‌తో ఈ విషయాన్ని చర్చిస్తానని తెలిపింది. ఇటీవల కాలంలో మహిళల బాడ్మింటన్ మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయని అన్నది. సగటున ప్రతి మ్యాచ్ 40 నిమిషాల పాటు కొనసాగడం ఆహ్వానించగతగిన పరిణామమని పేర్కొంది. ఒకుహరా, తాయ్ జూ ఇంగ్ వంటి మేటి క్రీడాకారులు ఉన్నందున, ఏక పక్షంగా మ్యాచ్‌లు సాగే కాలానికి తెరపడిందని ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో చెన్నై స్మాషర్స్ తరఫున ఆడుతున్న సింధు వ్యాఖ్యానించింది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, దేశంలో మ్యాచ్‌లు ఆడడం ఎంతో ఆనందాన్నిస్తుందని చెప్పింది. ప్రేక్షకుల అంచనాలకు తగిన స్థాయిలో రాణించాలన్న ఒత్తిడి ఉండదని, వారి మద్దతు మరింత ఉత్సాహాన్నిస్తుందని తెలిపింది. ఇటీవల దుబాయ్‌లో తాను టోర్నీ ఆడినప్పుడు, అక్కడ లభించిన ఆదరణను చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. తమ నుంచి అభిమానులు ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శనలనే కోరుకుంటారని, అయితే, ఒత్తిడికి లోనుకానని చెప్పింది. టోర్నీల షెడ్యూల్ ఎప్పుడూ ఒకే రీతిలో ఉండదని, కొన్ని మార్పులు చేర్పులు సహజమని సింధు తెలిపింది. కొన్ని సందర్భాల్లో కొత్తి టోర్నీలు కొన్ని వచ్చి చేరుతాయని, ఈ విషయంలో వాదనలకు ఆస్కారం ఉండదని చెప్పింది. వచ్చే ఏడాది షెడ్యూల్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నానని సింధు తెలిపింది. వచ్చే ఏడాది కూడా ఫిట్నెస్ సమస్యలు లేకుండా, సజావుగా సాగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. దేశానికి ఎక్కువ పతకాలు సాధించి పెట్టడమే తన ధ్యేయమని చెప్పింది.