క్రీడాభూమి

క్రీడా విశేషాలు....(గుర్తుకొస్తున్నాయి 2017)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడా రంగంలో 2017 సంవత్సరం ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయ. కొన్ని అద్భుతాలు.. మరికొన్ని వైఫల్యాలు.. కొన్ని రికార్డులు, మైలురాళ్లు.. మరికొన్ని పరాజయాలు, నిష్క్రమణలు.. ఇలా మంచిచెడు మేలి కలయకగా ఈ ఏడాది గడిచిపోయంది. గుర్తుచేసుకోతగ్గ ఎన్నో పరిణామాల్లో ప్రముఖంగా పేర్కోదగినది టెన్నిస్‌లో రోహన్ బొపన్న తన కెరీర్‌లోనే తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను గెల్చుకోవడం. స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా తన స్థాయకి తగినట్టు రాణించలేకపోవడం. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు తమ కంటే బలమైన ప్రత్యర్థులపై సంచలన విజయాలను నమోదు చేయడం వంటి సంఘటనలు ఈ ఏడాది ప్రాధాన్యతను సంతరించుకున్నాయ. వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా ఎంత అనూహ్యంగా మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడో, అంతే అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ అభిమానులకు ఇంకా ఆశ్చర్యం నుంచి కోలుకోకుండా చేస్తున్నది. సెలక్టర్లు అతనిని ఎందుకు ఎంపిక చేశారో? రిటైర్మెంట్ ప్రకటించాల్సిందిగా ఎందుకు పరోక్షంగా హెచ్చరించారో? ఎవిరకీ అర్థం కావడం లేదు. ఈ ఏడాది చోటు చేసుకున్న సంఘటనలను గుర్తుచేసుకుంటే, ముందుగా కళ్ల ముందు కదలాడే కొన్ని క్రీడా విశేషాలు....

టెన్నిస్‌లో నిరాశే!
భారత్‌కు టెన్నిస్ రంగం ఈ ఏడాది నిరాశనే మిగిలింది. రోహన్ బొపన్న తన కెరీర్‌లో మొట్టమొదటి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించడాన్ని మినహాయిస్తే, అంతర్జాతీయ టెన్నిస్ సర్క్యూట్‌పై భారతీయులు అద్భుతాలు సృష్టించలేకపోయారు. స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా వైఫల్యాలు అభిమానులను నీరుగార్చాయి. యువ ఆటగాళ్లు యుకీ భంబ్రీ, రాంకుమార్ రామనాథన్, సుమీత్ నగ్వాల్ తదితరులు తమ పోరాటాలతో దేశ ప్రతిష్ఠను నిలిపే ప్రయత్నం చేవారు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో కెనడాకు చెందిన గాబ్రియేలా డబ్రోవ్‌స్కీతో కలిసి ఆడిన బొపన్న టైటిల్ అందుకున్నాడు. ఫైనల్‌లో వీరు అన్నా లెనా గ్రొన్‌ఫీల్డ్ (జర్మనీ), రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీని ఓడించారు.
నెహ్రాకు ఘనంగా వీడ్కోలు
న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టి-20 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ముగిసిన వెంటనే వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. నిజానికి న్యూజిలాండ్‌తో టి-20 సిరీస్‌కు ఎంపిక చేసిన టీమిండియా జాబితాలో నెహ్రా లేడు. కానీ, నెహ్రా తన హోంగ్రౌండ్‌లో చివరి మ్యాచ్‌ని ఆడేందుకు వీలుగా, బీసీసీఐ అతని పేరును ప్రత్యేకంగా చేర్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లంతా నెహ్రాను తమ భుజాలపై ఊరేగించి ‘ల్యాప్ ఆఫ్ ఆనర్’ ప్రకటించారు. తర్వాత నెహ్రా మాట్లాడుతూ జాతీయ జట్టుకు ఆడనప్పుడు, మిగతా టోర్నీల్లో ఉండడం అనైతికమని పేర్కొంటూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)సహా అన్ని టోర్నమెంట్స్‌కూ గుడ్‌బై చెప్తున్నట్టు ప్రకటించాడు. వేలాది మంది అభిమానుల సమక్షంలో, సొంత మైదానంలో కెరీర్‌ను ముగించే అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్న నెహ్రా అదృష్టవంతుడు.
క్రికెట్ వ్యవహారాలకు లలిత్ మోదీ దూరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వినోదాత్మక క్రికెట్ టోర్నమెంట్‌గా తీర్చిదిద్ది, ఆ తర్వాత నిధుల దుర్వినియోగం ఆరోపణలపై టోర్నీ కమిషనర్ పదవిని కోల్పోయిన లలిత్ మోదీ క్రికెట్ వ్యవహారాల నుంచి వైదొలిగాడు. నాగపూర్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష పదవికి అతను రాజీనామా చేశాడు. యువ తరానికి బాధ్యతలు అప్పగించేందుకు వీలుగా తాను క్రికెట్ వ్యవహారాలకు గుడ్‌బై చెప్తున్నట్టు బిసిసిఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రికి పంపిన తన రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. ఐపిఎల్ టి-20 టోర్నమెంట్ లలిత్ మోదీ ఆలోచన నుంచే పుట్టింది.
రెండే రెండు!
నాగాలాండ్ మహిళల అండర్-19 జట్టు ఎవరూ ఇష్టపడని రికార్డును నమోదు చేసింది. కేవలం రెండంటే రెండు పరుగులకే ఆలౌటై అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసంది. కేరళతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న ఈ జట్టు 17 ఓవర్లు ఆడినప్పటికీ, రెండుకు మించి పరుగులు సాధించలేకపోయింది. తొమ్మిది మంది సున్నాకే అవుటయ్యారు. ఓపెనర్ మేనకా 18 బంతుల్లో ఒక పరుగు చేసింది. ఎక్‌స్ట్రాల రూపంలో ఒక పరుగు లభించడంతో నాగాలాండ్ స్కోరు రెండుకు చేరింది.
రికార్డు భాగస్వామ్యం
టి-20 ఫార్మాట్‌లో రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేసిన పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ కమ్రాన్ అక్మల్, సల్మాన్ బట్. జాతీయ టి-20 టోర్నమెంట్‌లో లాహోర్‌వైట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వీరు ఇస్లామాబాద్ జట్టుపై ఓపెనర్లుగా బరిలోకి దిగి, 209 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడిన కమ్రాన్ 71 బంతుల్లో 150 పరుగులు చేయగా, అతనికి చక్కటి సహకారాన్ని అందించిన సల్మాన్ బట్ 49 బంతుల్లో 55 పరుగులు చేశారు. వీరిద్దరూ, ఈ ఏడాది ఆరంభంలో జరిగిన నాట్‌వెస్ట్ టి-20 టోర్నీలో జో డెన్లీ, డానియల్ బెల్ డ్రమండ్ 207 పరుగులతో నెలకొల్పిన అత్యధిక భాగస్వామ్య రికార్డును బద్దలు చేశారు.
ఆసీస్‌పై బంగ్లా సంచలనం
స్వదేశంలో పంజా విసిరిన బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. షకీబ్ అల్ హసన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన బంగ్లాదేశ్‌ను 20 పరుగుల తేడాతో గెలిపించింది. రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఎదురుదాడికి దిగి, ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించి, సిరీస్‌ను డ్రా చేసుకుంది. అయితే, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించడం బంగ్లాదేశ్‌కు ఒక చిరస్మరణీయ సంఘటనగా గుర్తుండిపోతుంది.
నాట్సే నోటి దురుసు
టెన్నిస్ ప్రపంచంలో ‘ఆల్‌టైమ్ గ్రేట్’గా పిలిచే అతి కొద్ది మంది ఆటగాళ్లలో రుమేనియా మాజీ క్రీడాకారుడు ఇలీ నాట్సే ఒకడు. 70 ఏళ్ల వయసులోనే నాట్సే రుమేనియా ఫెడ్‌కప్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడంటే, రుమేనియా ప్రభుత్వానికి, అక్కడి టెన్నిస్ సమాఖ్యకు అతనిపై ఉన్న అభిమానాన్ని ఊహించుకోవచ్చు. గొప్ప క్రీడాకారుడిగా ప్రపంచ దేశాల మన్ననలు పొందుతున్న అతను నోటి దురుసు కారణంగా ఇప్పుడు విమర్శలకు గురవుతున్నాడు. ఫెడ్‌కప్ కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. ఈ ఏడాది ప్రారంభంలో, సెరెనా విలియమ్స్ గర్భవతి అన్న వార్త వెలువడిన వెంటనే, ఆమెను ఉద్దేశించి నాట్సే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పెళ్లికాకుండా తల్లి అయ్యేందుకు తొందరపడుతున్నదంటూ విమర్శించాడు. అంతటితో ఆగకుండా, రుమేనియా మహిళా జట్టు కెప్టెన్ అనే్న కొతావంగ్ కూడా తల్లికాబోతున్నదన్న వార్తపైనా అదే రీతిలో విరుచుకుపడ్డారు. రుమేనియా స్టార్ క్రీడాకారిణి జొహన్నా కొన్టాను సైతం విడిచిపెట్టలేదు. అందరినీ మూకుమ్మడిగా తిట్టిపోసి చిక్కుల్లో పడ్డాడు. నోరు పారేసుకున్న అతనిని ఫెడ్‌కప్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు రుమేనియా టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది.