క్రీడాభూమి

అండర్-19 వరల్డ్ కప్ అంపైర్ల ప్యానెల్‌లో ఇద్దరు భారతీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జనవరి 3: న్యూజిలాండ్‌లో ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్న అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎంపిక చేసిన 14 మంది సభ్యులతో కూడిన అంపైర్ల ప్యానెల్‌లో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. అనిల్ చౌదరి, సీకే నందన్ కూడా సభ్యులుగా ఉన్న ప్యానెల్ వివరాలను ఐసీసీ ప్రకటించింది. రాబర్ట్ బెయిలీ, టిమ్ రాబిన్సన్ వంటి హేమాహేమీలు ఈ జాబితాలో ఉన్నారు.

అంపైర్ల ప్యానెల్: రాబర్ట్ బెయిలీ, జార్జి బ్రాత్‌వెయిట్, అనిల్ చౌదరి, నిగెల్ డుగైడ్, షాన్ జార్జి, షాన్ హేగ్, మార్క్ హాథోర్న్, డేవిడ్ ఒడియాంబో, బుద్ధి ప్రధాన్, రాన్‌మోర్ మార్టినెజ్, సీకే నందన్, ఇయాన్ రామగే, ఐసాన్ రజా, షోజాబ్ రజా, టిమ్ రాబిన్సన్, లాంగ్టన్ రుసెర్, పాల్ విల్సన్. మ్యాచ్ రిఫరీలు: జెఫ్ క్రో, డేవదాస్ గోవింద్‌జీ, గ్రేమ్ లా బ్రూయ్.