క్రీడాభూమి

బెంగళూరు ఎన్‌సీఏకు బీసీసీఐ కార్యాలయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కేంద్ర కార్యాలయం ముంబయి నుంచి బెంగళూరుకు మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో బీసీసీఐ కార్యాలయం ఉంది. అయితే, బెంగళూరులో సుమారు 40 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సీఏ)కు దీనిని తరలించారన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తున్నది. ఎన్‌సీఏలో నిర్మాణ, ఆధునికీకరణ పనులు పూర్తయిన వెంటనే బిసీసీఐ కేంద్ర కార్యాలయాన్ని అక్కడికి మారుస్తారని బోర్డు వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ మార్పు జరగాలంటే కనీసం రెండుమూడు సంవత్సరాలు వేచి ఉండక తప్పదని ఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.