క్రీడాభూమి

బంగ్లాదేశ్ జట్టులో సబ్బీర్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్టగాంగ్, ఫిబ్రవరి 5: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సబ్బీర్ రహమాన్‌కు బంగ్లాదేశ్ టెస్టు జట్టులో చోటు దక్కింది. శ్రీలంకతో ఈనెల 8 నుంచి మొదలుకానున్న రెండో టెస్టులో సున్జాముల్ ఇస్లాం స్థానంలో అతనిని జట్టులోకి తీసుకున్నారు. సున్జాముల్‌తోపాటు రూబెల్ హొస్సేన్, ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడాగాయాలతో బాధపడుతున్న కారణంగా రెండో టెస్టుకు అందుబాటులో ఉండరు. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టులో భారీ స్కోర్లు నమోదైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీనితో రెండో టెస్టుపై ఇరు జట్లు దృష్టి పెట్టారు. పిచ్ మరోసారి బ్యాట్స్‌మెన్‌కు సహకరిస్తుందా? లేక ఈ టెస్టులోనైనా ఫలితం తేలుతుందా? అనేది ఆసక్తి కరంగా మారింది.