క్రీడాభూమి

వింటర్ ఒలింపిక్స్‌కు కేశవన్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: భారత ల్యూగర్ శివ కేశవన్ ఈనెల తొమ్మిది నుంచి 25వ తేదీ వరకు దక్షిణ కొరియాలోని పయాంగ్‌చాంగ్ ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యాడు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తరఫున ల్యూగ్‌లో పోటీపడుతున్న ఏకైక ఆటగాడు కేశవన్ ఆరోసారి వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు దక్షిణ కొరియా బయలుదేరుతున్న తరుణంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్‌కు సెలవు ప్రకటించడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. సుమారు 22 సంవత్సరాలు భారత్‌కు ప్రాతినిథ్యం వహించానని, పయాంగ్‌చాంగ్ వింటర్ ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్తానని 36 ఏళ్ల కేశవన్ స్పష్టం చేశాడు. 2014 సోచీ వింటర్ ఒలింపిక్స్‌లో కొంత మంది 46 ఏళ్ల వయసులోనూ పతకాలు సాధించారని, ఆ రకంగా చూస్తే తాను మరికొంత కాలం కెరీర్‌ను కొనసాగించగలుగుతానని పేర్కొన్నాడు. అయితే, ఇతరత్రా బాధ్యతలను భుజాలకెత్తుకున్నానని, అందుకే, ఈసారి వింటర్ ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ పోటీల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని అన్నాడు. కేశవన్ తండ్రి భారతీయుడుకాగా, తల్లి ఇటాలియన్. మనాలీలో పుట్టిపెరిగిన అతను ల్యూగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. 1998లో తొలిసారి వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. ఆసియా ల్యూగ్ చాంపియన్‌షిప్‌ను 2011, 2012, 2016, 2017 సంవత్సరాల్లో గెల్చుకున్నాడు. వింటర్ ఒలింపిక్స్‌లో తన అనుభవాలను అతను పీటీఐతో ప్రస్తావిస్తూ, మొట్టమొదటిసారి తాను ఐఓసీ పతాకంతో పాల్గొన్నానని అన్నాడు. ఆతర్వాత ప్రతి వింటర్ ఒలింపిక్స్‌లో, ప్రారంభోత్సవం లేదా ముగింపు సమయంలో భారత జాతీయ పతాకాన్ని పట్టుకొని మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నానని, ఇది తనకు గర్వకారణమని అన్నాడు. ల్యూగ్ వంటి క్రీడలపై యువతరం ఆసక్తి పెంచుకుంటున్నారని, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే సత్తావున్న వారు ఎంతో మంది దేశానికి పేరుప్రతిష్ఠలు తీసుకొస్తారన్న నమ్మకం తనకు ఉందని శివ కేశవన్ చెప్పాడు.