క్రీడాభూమి

అది నంబర్ వన్ గేమ్ కాదు: ద్రవిడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 5: ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించి, వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్నప్పటికీ, అది తమ ఆటగాళ్ల నంబర్ వన్ గేమ్ ఎంతమాత్రం కాదని భారత అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ నుంచి సోమవారం ఇక్కడికి చేరుకున్న తర్వాత, జట్టు కెప్టెన్ పృథ్వీ షాతో కలిసి విలేఖరుల సమావేశంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో క్వార్టర్ ఫైనల్, పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్‌లో ఆటగాళ్లు చూపిన ప్రతితో పోలిస్తే ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో అంత గొప్పగా ఏమీ ఆడలేదని స్పష్టం చేశాడు. అయతే, వరల్డ్ కప్ మొత్తంలో భారత యువసేన అద్భుతంగా రాణించిందని, టైటిల్‌ను సాధించే అర్హత ఈ జట్టుకు మాత్రమే ఉందని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, గొప్పగా పోరాడి సాధించిన విజయం ఎంతో సంతృప్తినిస్తుందని చెప్పాడు. అండర్-19 జట్టులోని చాలా మందికి ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నాడు. మొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వీరు రాణిస్తే, ఆతర్వాత జాతీయ జట్టులో చోటు సంపాదించుకోగలుగుతారని ద్రవిడ్ చెప్పాడు. మొత్తం మీద వరల్డ్ కప్‌లో వీరి ప్రదర్శన సంతృప్తికరంగా ఉందన్నాడు.

చిత్రం..ముంబయిలో కెప్టెన్ పృథ్వీ షాతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న
అండర్-19 క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్