క్రీడాభూమి

టీమిండియా హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్ టౌన్, ఫిబ్రవరి 7: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో వనే్డ ఇంటర్నేషనల్‌ను కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా గెల్చుకొని, ఆరు మ్యాచ్‌ల సిరీస్‌పై 3-0 ఆధిక్యాన్ని సంపాదించింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ అజేయ శతకంతో కదంతొక్కగా, దక్షిణాఫ్రికాలో భారత జట్టు మొదటిసారి వరుసగా మూడు వనే్డల్లో విజయాలను నమోదు చేసింది. భారత జట్టు సాధించిన 303 పరుగులకు సమాధానంగా దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. యువ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ చెరి నాలుగు వికెట్లు పడగొట్టి, దక్షిణాఫ్రికాను దారుణంగా దెబ్బతీశారు. భారత్ 124 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ మొదటి ఓవర్ చివరి బంతిలో తొలి వికెట్‌ను చేజార్చుకుంది. కాగిసో రబదా వేసిన తొలి ఓవర్ మొదటి ఐదు బంతులను రక్షణాత్మకంగా ఆడిన రోహిత్ శర్మ చివరి బంతిని హెన్రిచ్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కూలినప్పటికీ ఎలాంటి ఒత్తిడికి గురికాని రెండో ఓపెనర్ శిఖర్ ధావన్, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అవకాశం దొరికిన ప్రతిసారీ భారీ షాట్లు కొడుతూ స్కోరుబోర్డును ముందుకు దూకించారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను సులభంగా ఎదుర్కొన్న వీరు రెండో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 63 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లతో 76 పరుగులు చేసిన శిఖర్ ధావన్‌ను అయిడెన్ మర్‌క్రాన్ క్యాచ్ పట్టగా జీన్ పాల్ డుమినీ ఔట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లీ ఒకవైపు క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడితే, అజింక్య రహానే 11, హార్దిక్ పాండ్య 14, మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ 10, కేదార్ జాధవ్ ఒకటి చొప్పున పరుగులు చేసి పెవిలియన్ చేరారు. చివరిలో భువనేశ్వర్ కుమార్ (15)తో కలిసి నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ159 బంతులు ఎదుర్కొని 160 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా బౌలర్లలో డుమినీ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగిసో రబాదా, క్రిస్ మోరిస్, అండిల్ ఫెహ్లూక్వాయో , ఇమ్రాన్ తాహిర్ తలా ఒక్కో వికెట్ పంచుకున్నారు.
ఒక పరుగుకే తొలి వికెట్
భారత్‌ను ఓడించడానికి 304 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా కేవలం ఒక పరుగు స్కోరు వద్ద ఓపెనర్ హషీం ఆమ్లా వికెట్‌ను కోల్పోయింది. రెండు బంతులు ఎదుర్కొని, ఒక పరుగు చేసిన అతనిని జస్‌ప్రీత్ బుమ్రా ఎల్‌బిగా ఔట్ చేశాడు. అయితే, కెప్టెన్ అయిడెన్ మర్‌క్రాన్, ఆల్‌రౌండర్ డుమినీ జట్టును భారత బౌలింగ్‌కు ఎదురు నిలవడంతో దక్షిణాఫ్రికా ఊపిరి పీల్చుకుంది. రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించి, ప్రమాదరకంగా కనిపించిన ఈ భాగస్వామ్యాన్ని కుల్దీప్ యాదవ్ తన మొదటి ఓవర్‌లోనే బ్రేక్ చేశాడు. 42 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 32 పరుగులు చేసిన మర్‌క్రాన్ షాట్‌కు ప్రయత్నించి, వికెట్‌కీపర్ ధోనీ స్టంప్ చేయడంతో పెవిలియన్ చేరాడు. హెన్రిచ్ క్లాసెన్ 6 పరుగులు చేసి, యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. అర్ధ శతకాన్ని సాధించిన డుమినీ వికెట్‌ను కూడా చాహల్ పడగొట్టాడు. ఎల్‌బిగా ఔటైన డుమినీ 67 బంతుల్లో 51 పరుగులు చేశాడు. కొంత సేపు భారత బౌలింగ్‌ను ప్రతిఘటించిన డేవిడ్ మిల్లర్ 24 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ధోనీకి చిక్కాడు. హార్డ్ హిట్టర్ క్రిస్ మోరిస్ 14 పరుగులు చేసి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. 150 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయ కష్టాల్లో పడింది. మరో పరుగు కూడా జత కాకముందే, ఖయా జొన్డో వికెట్ కూలింది. 17 పరుగులు చేసిన అతనిని సబ్‌స్టిట్యూట్ ఆటగాడు మనీష్ పాండే క్యాచ్ అందుకోగా, యుజువేంద్ర చాహల్ పెవిలియన్‌కు పంపాడు. ఇమ్రాన్ తాహిర్ 8 పరుగులు చేసి, యుజువేంద్ర చాహల్ బౌలిం గ్‌లోనే కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరిలో, కుల్దీప్ యాద వ్ బౌలింగ్‌లో లున్గీ ఎన్గిడీ (6) ఎల్‌బి కావడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 40 ఓవర్లలో 179 పరుగుల వద్ద ముగిసింది.

కెరీర్‌లో 34వ వనే్డ ఇంటర్నేషనల్ సెంచరీ సాధించే క్రమంలో విరాట్ కోహ్లీ రెండు రికార్డులను అధిగమించాడు. కెప్టెన్‌గా వనే్డల్లో ఎక్కువ సెంచరీలు చేసిన సౌరవ్ గంగూలీని అతను అధిగమించాడు. కెప్టెన్‌గా సేవలు అందిస్తున్న సమయంలో గంగూలీ 11 శతకాలు సాధిస్తే, కోహ్లీ కెప్టెన్‌గా 12వ సెంచరీని నమోదు చేశాడు. అంతేగాక, 34 సెంచరీలను తక్కువ ఇన్నింగ్స్‌లో పూర్తి చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా కూడా అతను చరిత్ర సృష్టించాడు. 197వ ఇన్నింగ్స్‌లోనే అతను ఈ మైలురాయని చేరుకోగా సచిన్‌కు 101 ఇన్నింగ్స్ అధికంగా, అంటే, 298 ఇన్నింగ్స్ పట్టింది.

స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి హెన్రిచ్ క్లాసెన్ బి కాగిసో రబదా 0, శిఖర్ ధావన్ సి అయిడెన్ మర్‌క్రాన్ బి డుమినీ 76, విరాట్ కోహ్లీ 160 నాటౌట్, అజింక్య రహానే సి అండిల్ ఫెహ్లూక్వాయో బి డుమినీ 11, హార్దిక్ పాండ్య సి హెన్రిచ్ క్లాసెన్ బి క్రిస్ మోరిస్ 14, మహేంద్ర సింగ్ ధోనీ సి లున్గీ ఎన్గిడీ బి ఇమ్రాన్ తాహిర్ 10, కేదార్ జాధవ్ సి హెన్రిచ్ క్లాసెన్ బి అండిల్ ఫెహ్లూక్వాయో 1, భువనేశ్వర్ కుమార్ 16 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 15, మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 303.
వికెట్ల పతనం: 1-0, 2-140, 3-160, 4-188, 5-228, 6-236.
బౌలింగ్: కాగిసో రబదా 10-1-54-1, లున్గీ ఎన్గిడీ 6-0-47-0, క్రిస్ మోరిస్ 9-0-45-1, అండిల్ ఫెహ్లూక్వాయో 6-0-42-1, ఇమ్రాన్ తాహిర్ 9-0-52-1, జీన్ పాల్ డుమినీ 10-0-60-2.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: హషీం ఆమ్లా ఎల్‌బి జస్‌ప్రీత్ బుమ్రా 1, అయిడెన్ మర్‌క్రాన్ స్టంప్డ్ మహేంద్ర సింగ్ ధోనీ బి కుల్దీప్ యాదవ్ 32, జీన్ పాల్ డుమినీ ఎల్‌బి యుజువేంద్ర చాహల్ 51, హెన్రిచ్ క్లాసెన్ ఎల్‌బి యుజువేంద్ర చాహల్ 6, డేవిడ్ మిల్లర్ సి మహేంద్ర సింగ్ ధోనీ బి జస్‌ప్రీత్ బుమ్రా 25, ఖయా జొన్డో సి (సబ్‌స్టిట్యూట్) మనీష్ పాండే బి యుజువేంద్ర చాహల్ 17, క్రిస్ మోరిస్ ఎల్‌బి కుల్దీప్ యాదవ్ 14, అండిల్ ఫెహ్లూక్వాయో సి విరాట్ కోహ్లీ బి కుల్దీప్ యాదవ్ 3, కాగిసో రబదా 12 నాటౌట్, ఇమ్రాన్ తాహిర్ సి విరాట్ కోహ్లీ బి యుజువేంద్ర చాహల్ 8, లున్గీ ఎన్గిడీ ఎల్‌బి కుల్దీప్ యాదవ్ 6, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (40 ఓవర్లలో ఆలౌట్) 179.
వికెట్ల పతనం: 1-1, 2-79, 3-88, 4-95, 5-129, 6-150, 7-150, 8-158, 9-167, 10-179.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 7-0-41-0, జస్‌ప్రీత్ బుమ్రా 7-0-32-2, హార్దిక్ పాండ్య 8-0-35-0, యుజువేంద్ర చాహల్ 9-0-46-4, కుల్దీప్ యాదవ్ 9-1-23-4.