క్రీడాభూమి

నబీ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షార్జా, ఫిబ్రవరి 7: జింబాబ్వేతో జరిగిన చివరి, రెండో టీ-20 ఇంటర్నేషనల్‌ను 17 పరుగుల తేడాతో గెల్చుకున్న అఫ్గానిస్తాన్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. మహమ్మద్ నబీ విజృంభణ అఫ్గాన్ విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 158 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడిన నబీ కేవలం 26 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లతో 45 పరుగులు సాధించాడు. కరీం సాదిక్ 28, అజ్గర్ స్టానిక్‌జాయ్ 27, నజీబుల్లా జద్రాన్ 24 చొప్పున పరుగులు చేయడంతో, అఫ్గానిస్తాన్ గౌరవ ప్రదమైన స్కోరును అందుకోగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే పరుగుల వేటలో విఫలమై, 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 141 పరుగులు చేయగలిగింది. సికిందర్ రజా 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ జద్రాన్, రషీద్ ఖాన్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో అఫ్గాన్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వేపై క్లీన్‌స్వీప్ సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 9 వికెట్లకు 158 (మహమ్మద్ నబీ 45, కరీం సాదిక్ 28, నజీబుల్లా జద్రాన్ 24, అజ్గర్ స్టానిక్‌జాయ్ 27 టెండై చతారా 3/20).
జింబాబ్వే ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 (సికందర్ రజా 40, ముజీ బ్ జద్రాన్ 2/21, రషీద్ ఖాన్ 2/23).