క్రీడాభూమి

ఒత్తిడి లేకుండా ఆడడమే నా కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్ టౌన్, ఫిబ్రవరి 8: మైదానంలో తనదైన స్టయిల్‌లో ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్ల బంతులను తుత్తినియలు చేసే భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరును వేనోళ్ల పొగడనివారు ఉండరు. బ్యాటింగ్ చేస్తున్నపుడు ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా ఆడడమే తన ముందున్న కర్తవ్యమని అతను అన్నాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో వనే్డలో కోహ్లీ 124 పరుగులు ఎదుర్కొని 160 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, వనే్డలో 34 సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. కీలక మ్యాచ్‌గా పరిగణించిన ఈ సమయంలో జట్టు కెప్టెన్‌గా సమర్ధమైన పాత్ర పోషించాడు. ఈ ఏడాది 30వ పడిలో పడుతున్న కోహ్లీ 34-35 ఏళ్లు వచ్చేవరకు ఇలానే ఆటతీరును ప్రదర్శిస్తానని గట్టి నమ్మకంతో చెబుతున్నాడు. యువకుడిగా ఉన్నందున మైదానంలోకి వెళ్లినపుడు బౌలర్ ఎవరు అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తనదైన శైలిలో దూసుకుపోవడమే ఎంతో ఇష్టమని అన్నాడు. ‘అంతర్జాతీయ టోర్నీలలో పరుగులు చేయడం అంత సులభం కాదు, కొన్ని పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండవు. బంతులు బౌన్స్ అయినా, పేస్ అయినా ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధమే’ అని కోహ్లీ పేర్కొన్నాడు.