క్రీడాభూమి

కజక్ చేతిలో భారత్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రతిష్ఠాత్మక ఫెడ్ కప్ ఆసియా/ఓషియానిగా గ్రూప్-1 ప్లే ఆఫ్‌లో భాగంగా గురువారం జరిగిన పోరులో కజకస్థాన్ చేతిలో భారత్ 1-2 తేడాతో పరాజయాన్ని చవిసింది. జపాన్‌తో పోరాడి గెలిచిన విధంగానే అంకిత రైనా కజక్‌పైన కూడా పూర్తి ఆధిపత్యాన్ని కనబరచి, విజయాన్ని నమోదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మొదటి మ్యాచ్‌లో జరినా డయాస్‌తో తలపడిన కర్మాన్ కౌర్ థండి 0-6, 4-6 తేడాతో ఓటమిపాలైంది. అయితే, రెండో మ్యాచ్‌లో అంకిత అద్వితీయ ప్రతిభ కనబరచింది. జూలియా పటింట్సోవాను 6-3, 1-6, 6-4 ఆధిక్యంతో ఓడించింది. కానీ కీలకమైన చివరి మ్యాచలో ప్రార్థన తుంబారేతో కలిసి ఆడిన అంకితకు పరాజయం తప్పలదు. జరీనా డయాస్, జూలియా పటింట్సోవా జోడీ 6-0, 6-4 ఆధిక్యంతో అంకిత, ప్రార్థన జోటీపి ఓడించారు.