క్రీడాభూమి

రష్యా ఉక్కిరిబిక్కిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 8: వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడి, సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న రష్యా ఏం చేయాలో దిక్కుతోచక ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. డోప్ పరీక్షలో విఫలమై, వింటర్ ఒలింపిక్స్ నుంచి నిషేధానికి గురైన 28 మంది అథ్లెట్లకు క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చినా ఫలితం లేకపోయింది. డోప్ దోషులను వింటర్ ఒలింపిక్స్‌కు ఆహ్వానించేది లేదని ఒలింపిక్స్ స్థానిక నిర్వహణ కమిటీ (ఓసీ) స్పష్టం చేయడంతో రష్యాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీనిపై అప్పీల్ చేసి, అనుకూలంగా తీర్పు సంపాదించుకునేలోపే వింటర్ ఒలింపిక్స్ ముగుస్తాయన్నది వాస్తవం. డోప్ సుడిగుండంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతున్న రష్యాకు ఐఓసీ ఇటీవల తీసుకున్న నిర్ణయం శరాఘాతమైన విషయం తెలిసిందే. వింటర్ ఒలింపిక్స్ నుంచి రష్యాను సస్పెండ్ చేస్తూ ఐఓసీ తీర్మానాన్ని ఆమోదించడంతో డోప్ ప్రకంపనలు అంతర్జాతీయ క్రీడా రంగాన్ని ఇప్పటికీ వెంటాడుతున్నాయనే విషయం స్పష్టమైంది. రియో సమ్మర్ ఒలింపిక్స్‌కు ముందు కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే తలెత్తింది. అప్పట్లో ఐఓసీ పతాకం కింద రష్యా అథ్లెట్లు పోటీ చేశారు. తాజా పరిణామం కారణంగా, వింటర్ ఒలింపిక్స్‌లోనూ ఐఓసీ పతాకంపైనే రష్యా అథ్లెట్లు బరిలోకిదిగుతారు. దేశ క్రీడా రంగానికి కొత్త రూపాన్ని ఇవ్వడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రష్యాకు గత ఏడాది రియో ఒలింపిక్స్, తాజాగా పయాంగ్‌చాంగ్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కలేదు. వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిన కారణంగా సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటున్న రష్యా దిద్దుబాటు చర్యలు ఎంత వరకూ చేపట్టిందనేదే ప్రశ్న. డోపింగ్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు ఉన్నా, అందుకు సహకరించినా కఠిన చర్యలు తప్పవని సర్కారు ప్రకటిస్తుండగా, ఒకరి తర్వాత మరొకరిగా డోప్ దోషులు పుట్టుకు రావడం రష్యాను ఆందోళనకు గురి చేస్తున్నది. వింటర్ ఒలింపిక్స్‌లో ఎవరూ డోప్ పరీక్షలో దోషులుగా తేలకపోతే, రష్యా ఊపిరి పీల్చుకుంటుంది. అప్పటి వరకూ అందరి కళ్లూ ఆ దేశ అథ్లెట్లపైనే ఉంటాయన్నది వాస్తవం.