క్రీడాభూమి

షిఫ్రిన్ ఎదురుచూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పయాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా), ఫిబ్రవరి 12: వింటర్ ఒలింపిక్స్‌లో మరోసారి సత్తా చాటాలన్న ఉత్సాహంతో ఉన్న అమెరికా స్లాలమ్ రేసర్ మిఖయేలా షిఫ్రిన్ బరిలోకి దిగేందుకు ఎదురుచూడక తప్పడం లేదు. మహిళల స్లాలమ్ విభాగంలో పోటీలు సోమవారం ప్రారంభం కావాల్సి ఉండగా, వాతావరణం అనూకలంగా లేకపోవడంతో గురువారానికి వాయిదా వేశారు. పోటీలను నిర్వహించాల్సిన ప్రాంతమంతా దట్టమైన మంచుతో నిండిపోగా, బలమైన శీతల గాలలు మరిన్ని సమస్యలను కొని తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పోటీల విషయం ఎలావున్నా, కనీసం ప్రాక్టీస్‌కు కూడా కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. -16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో స్లాలమ్ పోటీలను ప్రారంభించడం అసాధ్యమని అధికారులు నిర్ణయించారు. దీనికితోడు సెకనుకు 18 మీటర్ల వేగంతో శీతల గాలులు వీస్తున్నందున పోటీలను వాయిదా వేయక తప్పలేదని వింటర్ ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ (ఓసీ) ప్రకటించింది. దీనితో స్లాలమ్ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి రేసును మొదలు పెట్టాల్సిన షిఫ్రిన్ గురువారం వరకూ వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.