క్రీడాభూమి

విజయమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 15: దక్షిణాఫ్రికాపై వనే్డ సిరీస్‌ను ఇప్పటికే 4-1 ఆధిక్యంతో గెల్చుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా శుక్రవారం నాటి చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో చెలరేగిన నేపథ్యంలో, ఐదో వనే్డలో భారత్ విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. దర్బన్, సెంచూరియన్, కేప్‌టౌన్, పోర్ట్ ఎలిజబెత్‌లో విజయాలను నమోదు చేసిన కోహ్లీ సేన జొహనె్నస్‌బర్గ్‌లో మాత్రం పరాజయాన్ని చవిచూసింది. సిరీస్‌ను దక్కించుకోవడంతోపాటు, మళ్లీ వనే్డల్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌లోకి దూసుకెళ్లిన భారత్, ఎలాంటి ప్రాధాన్యం లేని చివరి మ్యాచ్‌ని తేలిగ్గా తీసుకుంటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడానికే కృషి చేస్తామని, సిరీస్‌ను 5-1గా ముగించడమే తమ లక్ష్యమని కోహ్లీ స్పష్టం చేశాడు. ఆధిక్యాన్ని మరింత పెంచుకోవడానికి భారత్ ప్రయత్నిస్తుండగా, సిరీస్ కోల్పోయినప్పటికీ, చివరి మ్యాచ్‌ని గెల్చుకొని కొంతైనా పరువు నిలబెట్టుకోవాలని దక్షిణాఫ్రికా చెమటోడ్చనుంది. క్వింటన్ డి కాక్, ఫఫ్ డు ప్లెసిస్ గాయాలతో దూరం కావడం, ఏబీ డివిలియర్స్ కూడా పూర్తి ఫామ్‌లో లేకపోవడం దక్షిణాఫ్రికాను వేధిస్తున్న ప్రధాన సమస్యలు. దీనికితోడు స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ఆ జట్టు బ్యాట్స్‌మెన్ తంటాలు పడుతున్నారు. యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ విజృంభణకు వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి మార్గాలను సిద్ధం చేసుకుంటున్నామని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం భారత్‌కే విజయమని జోస్యం చెప్తున్నారు.