క్రీడాభూమి

ఏపీలో పది క్రీడా అకాడమీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో కొత్తగా పది క్రీడా అకాడమీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ క్రీడాసాధికారిత సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బంగార్రాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు ఆదివారం వచ్చిన ఆయన ఇక్కడి సెట్‌శ్రీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర క్రీడాపాలసీ, యువజన, క్రీడావిధానాన్ని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆరు క్రీడా అకాడమీలు ఉన్నాయన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అకాడమీలు టీమ్ స్పోర్ట్స్‌కు సంబంధించినవని చెప్పారు. ఇకపై జిల్లాలో పరిపాలనాపరమైన అంశాలను జిల్లా యువజన క్రీడల అధికారి నిర్వహిస్తారని క్రీడాకారులకు కోచింగ్ తదితర క్రీడా సాంకేతికతకు సంబంధించిన అంశాలను చీఫ్ కోచ్ చూస్తారని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్రంలో క్రీడల్లో స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఆచార్య నాగార్జున వర్శిటీలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో ప్రతిభావంతులైన 75మంది క్రీడాకారులను ఎంపిక చేసి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా విదేశీ కోచ్‌లతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. విదేశీ కోచ్‌లు మూడేళ్ళపాటు ఇక్కడే ఉండి కోచింగ్ ఇస్తారని తెలిపారు. తరువాత మూడేళ్ళపాటు వచ్చి వెళ్తూ తర్ఫీదును పర్యవేక్షిస్తారన్నారు. దక్షిణాఫ్రికాను నుండి నలుగురు, కెన్యా నుండి ముగ్గురు కోచ్‌లు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో క్రీడామైదానాలను అభివృద్ధి చేసేందుకు ఒక్కొక్క మైదానానికి రూ. 5 లక్షల చొప్పున ఉపాధి హామీలో మంజూరు చేసినట్టు తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణం అక్టోబర్ లేదా నవంబర్ నెలకు పూర్తవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈ సమావేశంలో సెట్ శ్రీ సి ఈవో బి.వి ప్రసాదరావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్