క్రీడాభూమి

ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. నిలబడ్డాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, ఫిబ్రవరి 25: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రతికూల అంశాలు ఎదురైనా తట్టుకుని పోరాడి నిలబడడం ద్వారా విజయం సాధించామని భారత్ క్రికెట్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తమ జట్టు సభ్యులమంతా సమష్టిగా రాణించడంతో శనివారం జరిగిన టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను 2-1 తేడాతో గెలుపొందామని ఆయన అన్నాడు.
ఈ సిరీస్ మొత్తంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తామంతా తట్టుకుని నిలబడి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదల, నమ్మకంతో పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించామని పేర్కొన్నాడు. టీ-20 సిరీస్‌ను గెలుచుకోవడంలో కొత్త బంతులతో ప్రయోగం చేసిన తమ సహచర జట్టు బౌలర్లను ఆయన అభినందించాడు. ఈ గెలుపు క్రెడిట్ అంతా వారిదేనని ఆయన అన్నాడు. ఇందుకోసం తాము ముందుజాగ్రత్తగా కొన్ని ప్రణాళికలు రచించి, అందుకు అనుగుణంగా ఆడడం ద్వారా మంచి ఫలితం రాబట్టామని అన్నాడు. టీ-20 ఆఖరి మ్యాచ్ సమయంలో ప్రత్యర్థి దూకుడు చూసి సిరీస్ కోల్పోతామేమోనని అనుమానించామని, కానీ తమ బౌలర్లు తమ ఆటతీరుతో కట్టడి చేయడంతో ఘన విజయం నమోదు చేసుకున్నామని అన్నాడు. సురేష్ రైనాపై విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్ర్తీ పెట్టుకున్న ఆశలను వమ్ముచేయకుండా 27 బంతులు ఎదుర్కొని 43 పరుగులు చేయడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడని, భువనేశ్వర్ కుమార్ సిరీస్ మొత్తంలో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచినందుకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడని అన్నాడు. ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడిన అనుభవం ఇప్పుడు షార్ట్ ఫార్మాట్లలో బాగా కలిసివచ్చిందని భువనేశ్వర్ కుమార్ అన్నాడు. కరేబియన్ గడ్డలో టూర్‌ను తాను ఎంతో ఆస్వాదించానని, ఇందుకు తాను తగిన ప్రిపరేషన్‌తో ముందుకు రావడం చాలా కలసి వచ్చిందని అన్నాడు.