క్రీడాభూమి

నిషేధం విధించినా అగ్రస్థానంలో రబడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌లలో దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలర్, యువ సంచలనం కగిసో రబడ నెంబర్ వన్ క్రికెటర్‌గా చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను రబడ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యాడు. అయినా, ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు. 202 పాయింట్లతో టెస్టుల్లో టాప్ బౌలర్‌గా ఖ్యాతి గడించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో తమ జట్టును విజయతీరాలకు చేర్చడంతో రబడ కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 11 వికెట్లు తీసుకోవడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు నంబర్‌వన్ బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రబడ 900 పాయింట్లను దాటిన 23వ బౌలర్‌గా రికార్డుల్లో చోటు దక్కించుకుని దక్షిణాఫ్రికా టీమ్‌లో ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. గతంలో దక్షిణాఫ్రికా నుంచి ఫిలాండర్ 2013లో 912 పాయింట్లు, షాన్ పొలాక్ 1999లో 909 పాయింట్లు, డేల్ స్టెయిన్ 2104లో 909 పాయింట్లు సాధించారు. ఇక భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగు స్థానానికి ఎగబాకాడు. జోష్ హాజల్ ఉడ్ నాలుగు నుంచి ఐదో స్థానానికి చేరుకోగా, మిచెల్ స్టార్క్ ఐదు నుంచి తొమ్మిదో స్థానానికి నెట్టి అశ్విన్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియాకు చెందిన మరో క్రికెటర్ రవీంద్ర జడేజా తన మూడో స్థానాన్ని పదిలపరచుకున్నాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ రెండో స్థానానికి పడిపోయాడు. ఇక బ్యాట్స్‌మెన్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. అదేవిధంగా భారత జట్టులోని మరో క్రికెటర్ చటేశ్వర పుజారా ఆరో స్థానాన్ని కాపాడుకున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఐదు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకుని తన ర్యాంకును మరింత మెరుగుపరచుకున్నాడు. ఇదే జట్టులోని హషీం ఆమ్లా ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ మూడో స్థానం, న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ నాలుగో స్థానం, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐదో స్థానంలో నిలిచారు.