క్రీడాభూమి

కలకాలం గుర్తుగా ఆ సిక్సర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 19: శ్రీలంక ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన నిదహాస్ టీ-20 ఇంటర్నేషనల్ ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్ చివరి బంతిని సిక్సర్‌గా మలచి ఉత్కంఠకు తెరదించిన ఘటన తన జీవితాంతం గుర్తుంటుందని భారత క్రికెట్ టీమ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ అన్నాడు. బంగ్లాతో జరిగిన ఫైనల్ పోరులో సిరీస్‌ను జారవిడుచుకుంటామేమోనన్న భయం, అనుమానం వెంటాడుతుంటే ‘నేనున్నాను’ అంటూ భారత జట్టుకు ట్రోఫీని అందించడంలో ముఖ్య పాత్ర పోషించిన దినేష్‌కు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా జట్టు సభ్యులు, టీమ్ మేనేజిమెంట్ సహా దేశమంతటా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీ-20 ఫైనల్‌లో సిక్స్ కొట్టి టీమిండియాకు మరపురాని విజయాన్ని అందించి చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా లక్ష్య ఛేదనవలో అంతర్జాతీయ టీ-20 వేదికలపై ఫైనల్‌లో చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల పుటల్లోకి ఎక్కాడు. దినేష్ కార్తీక్ క్రికెట్‌లో అగ్రగణ్యులుగా పేరుగాంచిన హృషికేష్ కనిత్కర్ లేదా జోగీందర్ శర్మ కాకపోవచ్చు కానీ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో ఆఖరి బంతిని సిక్సర్‌గా అద్భుతంగా మలచి తీరు అతని మదిలో కలకాలం నిలిచి ఉంటుందనేది నిర్వివాదాంశం. అయితే, వీరిద్దరికీ భిన్నంగా దినేష్ కార్తీక్ వ్యవహరించి, తన అసాధారణ ప్రతిభ, ఆటతీరుతో 13 ఏళ్లకు పైగా క్రికెట్‌లో ఆడుతున్నా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ-20 ఫైనల్‌లో అద్భుతంగా మెరిశాడు. దీంతో ఒకప్పటి సీనియర్ క్రికెటర్లుగా వినుతికెక్కిన హృషికేష్ కనిత్కర్, జోగీందర్ శర్మలతో అతనిని పలువురు పోల్చినపుడు దినేష్ కార్తీక్ సంతోషం వ్యక్తం చేస్తూ అలాంటి క్రికెట్ ఉద్ధండుల సరసన తనను పోల్చడం మరచిపోలేని అనుభూతి అని అన్నాడు. టీ-20 ఫైనల్‌లో తాను చూపిన తెగువ మరపురానిదిగా గుర్తుంటుందని అన్నాడు. గత ఏడాది కాలంగా టీమిండియాలో కొనసాగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, భారత్ అద్భుత విజయాలు సాధించడంలో తాను కూడా భాగస్వామినైనందుకు గర్వంగా ఉందని ఆయన అన్నాడు. చేసిన పనిలో పట్టుదలతో శ్రమిస్తే విజయం వరిస్తుందనే అంశాన్ని తాను నమ్ముతానని ఆయన పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రేమదాస స్టేడియంనకు వచ్చిన ప్రేక్షకులు ఆద్యంతం పోటీని తిలకించడంతోపాటు తమకు మద్దతుగా నిలవడంతోనే తాను అద్భుతంగా బ్యాటింగ్ చేయడానికి పరోక్షంగా సహకారం అందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.