క్రీడాభూమి

బౌల్ట్ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, మార్చి 22: న్యూజిలాండ్‌తో గురువారం మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కేవలం 58 పరుగులకే కుప్పకూలింది. ట్రెంట్ బౌల్ట్ ఆరు వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్‌ను దారుణంగా దెబ్బతీశాడు. టిమ్ సౌథీ నాలుగు వికెట్లతో రాణించి, న్యూజిలాండ్ ఆధిపత్యాన్ని కొనసాగించాడు. కాగా, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 175 పరుగులు చేసింది. ఇప్పటి మొదటి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన న్యూజిలాండ్ వద్ద ఇంకా ఏడు వికెట్లు ఉన్నాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఒకదాని తర్వాత మరొకటిగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మార్క్ స్టోన్‌మన్ (11), టెయిలెండర్ క్రటెగ్ ఓవర్టన్ (33) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోవడం ఇంగ్లాండ్ వైఫల్యాలకు ఆద్దం పడుతుంది. మొత్తం మీద 20.4 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను 58 పరుగులకే పరిమితం చేసుకుంది. 10.4 ఓవర్లు బౌల్ చేసిన బౌల్ట్ 32 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. సౌథీ 25 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఎనిమిది పరుగుల వద్ద తొలి వికెట్‌ను జీత్ రావల్ (3) రూపంలో కోల్పోయింది. జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో అతను జానీ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ టామ్ లాథమ్ 26 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద క్రిస్ వోక్స్ క్యాచ్ అందుకోగా స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. రాస్ టేలర్ వికెట్‌ను ఆండర్సన్ పడగొట్టాడు. 20 పరుగులు చేసిన టేలర్‌ను వోక్స్ క్యాచ్ పట్టగా ఆండర్సన్ వెనక్కు పంపాడు. కాగా, కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (91 నాటౌట్), హెన్రీ మికోల్స్ (24 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ స్కోరును మూడు వికెట్లకు 175 పరుగులకు చేర్చారు. ఆండర్సన్‌కు రెండు వికెట్లు లభించగా, బ్రాడ్ ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.