క్రీడాభూమి

వివాన్‌కు కాంస్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మార్చి 23: సిడ్నీ కేంద్రంగా జరుగుతున్న జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం యువ షూటర్ వివాన్ కపూర్ రెండు కాంస్య పతకాలను భారత్‌కు అందించాడు. దీంతో టోర్నమెంట్‌లో పతకాల జాబితాలో భారత్ రెండు స్వర్ణాలు, మూడు కాంస్యాలతో రెండో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో ఐదు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యలతో చైనా ఆగ్ర స్థానంలో ఉంది. వ్యిక్తిగత విభాగంలో 113 పాయింట్తలో ఫైనల్‌కి చేరిన వివాన్ కపూర్ తుది పోరులోను అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత ముగ్గురు షూటర్ల బృందంతో జరిగిన పోటీలోనూ భారత్ కాంస్యం గెలవడంలో వివాన్ కీలక పాత్ర పోషించాడు. గురువారం యువ షూటర్ ఎలవెనిల్ కూడా ఫైనల్లో 249.8 పాయింట్లతో ఆగ్రస్థానం దక్కించుకోగా.. క్వాలిఫయింగ్‌లో ఆమె 631.4 పాయింట్లతో ప్రపంచ రికార్డును తిరగరాసిన విషయం తెలిసిందే.

చిత్రం..వివాన్ కపూర్