క్రీడాభూమి

మరో మెడల్‌పై నీరజ్ చోప్రా కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల నిర్వహించిన 21వ కామనె్వల్త్ గేమ్స్‌లో (జావెలిన్ త్రో) మన దేశానికి తొలిసారిగా గోల్డ్ మెడల్ అందించిన ఘనత సాధించిన అథ్లెట్ నీరజ్ చోప్రా ఇపుడు మరో గోల్డ్ మెడల్‌పై కనే్నశాడు. హర్యానాకు చెందిన 20 ఏళ్ల జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా వచ్చే ఒలింపిక్స్‌లో 90 మీటర్ల వరకు జావెలిన్ త్రోను విసిరడం ద్వారా మరో గోల్డ్ మెడల్ సాధించేందుకు తహతహలాడుతున్నాడు. 2016లో జరిగిన వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లోని జావెలిన్ త్రో విభాగంలో 86.47 మీటర్ల వరకు విసిరి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. అతని ఖాతాలో ఇపుడు మరో బంగారు పతకం చేరింది. ఇటీవల గోల్డ్ కోస్ట్‌లో జరిగిన జావెలిన్ త్రో పోటీలో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా ఇప్పటివరకు భారత్ తరఫున వ్యక్తిగత విభాగంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన నాలుగో అథ్లెట్‌గా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నాడు. ‘జర్మనీలో ప్రముఖ జావెలిన్ త్రో కోచ్ వెర్నెర్ డేనియల్స్ పర్యవేక్షణలో మూడు నెలలపాటు కఠోర శిక్షణ పొందాను. ఇదే గోల్డ్ కోస్ట్‌లో గోల్డ్ మెడల్ సాధించేందుకు దోహదపడింది. ఇదే తరహాలో ఏ అథ్లెట్ అయినా కఠోర శిక్షణ తీసుకుంటే నాలాగే మన దేశానికి ఎన్నో పతకాలు అందించవచ్చు’ అని ఆయన ఇక్కడ ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఒక సన్మాన కార్యక్రమం సందర్భంగా పీటీఐతో మాట్లాడుతూ అన్నాడు. ‘నా లక్ష్యం 90 మీటర్ల వరకు జావెలిన్ త్రోను విసరడం. దీనిని సాధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తా..వచ్చే ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో మరో గోల్డ్ మెడల్ సాధిస్తా’ అని ఆయన గట్టి నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని వెలిబుచ్చాడు. రానున్న రోజుల్లో ఆసియన్ గేమ్స్, ఆ తర్వాత ఒలింపిక్స్ పోటీలు జరుగనున్నాయని, వీటికంటే ముందు జరిగే డైమండ్ లీగ్ సిరీస్‌లలో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. వచ్చే ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్ జరుగుతుందని, దీనిలో కూడా ఉత్తమంగా రాణించేందుక తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశాడు.
అథ్లెట్ నీరజ్ చోప్రాకు ఘనస్వాగతం
గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో మన దేశానికి బంగారు పతకాన్ని అందించిన అథ్లెట్ నీజర్ చోప్రా మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన సందర్భంగా ఘనంగా స్వాగతం లభించింది.
నీరజ్‌తోపాటు మిగిలిన అథ్లెట్ల బృందానికి అధికారులు, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సీనియర్ ఆర్మీ అధికారులు, వారి బంధువులు, స్నేహితులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేకంగా హర్యానాలోని ఒక గ్రామానికి చెందిన అథ్లెట్ నీరజ్ చోప్రా ప్రస్తుతం ఆర్మీలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌గా ఉన్నాడు. తమకు ఘన స్వాగతం పలకడానికి వచ్చిన అనేక మంది ప్రజలు, బంధువులు, స్నేహితులు, అధికారులకు నీరజ్ చోప్రా కృతజ్ఞతలు తెలిపాడు.